డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై చెప్పు విసిరిన వరంగల్ జిల్లా శాయంపేట మం డలం ఆరెపల్లికి చెందిన దామెరకొండ
శాయంపేట: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై చెప్పు విసిరిన వరంగల్ జిల్లా శాయంపేట మండలం ఆరెపల్లికి చెందిన దామెరకొండ కొమురయ్య ఆత్మహత్యకు యత్నించాడు. నవంబర్ 6న శాయంపేట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున జరిగిన ప్రచారసభలో కడియం ప్రసంగిస్తుండగా కొమురయ్య చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పది రోజులపాటు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కాగా, జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కొమురయ్యను పోలీ సులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేసి సాయంత్రం వదిలేశారు.
మంగళవారం ఉదయం మళ్లీ అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కొమురయ్య ఇంటికి వెళ్లారు. అనారోగ్యంగా ఉందని, పోలీస్‌స్టేషన్‌కు రాలేనని చెప్పగా, స్టేషన్‌కు రావాల్సిందేనని పోలీసు లు అనడంతో కొమురయ్య కిరోసిన్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. నిప్పం టించుకోకుండా వెంటనే పోలీ సులు వారించారు. చెల్పూరులో కేసీఆర్ బహిరంగసభ అయిపోయే వరకు కొముర య్య గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా పోలీ సులు కాపలా కాశారు.