తాండూరు రూరల్: మండలంలోని కరన్‌కోట్ గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గ్రామశివారులో ఉన్న ‘సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ) ఫ్యాక్టరీ నుంచి ప్రతి రోజు గ్రామంలోకి దుమ్ము, ధూళి వస్తోంది. దీంతో గ్రామస్తులు కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు దీన్ని చూసీచూడనట్లు నిద్రావస్థలో ఉన్నారు.
కరన్‌కోట్ చుట్టూ నాపరాతి నిక్షేపాలు ఉండటంతో 1983లో కేంద్ర ప్రభుత్వం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని గ్రామ శివారులో స్థాపించింది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అప్పట్లో గ్రామస్తులు కం పెనీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉపాధి సంగతేమో గానీ కంపెనీ వచ్చినప్పటినుంచి గ్రామస్తులకు రోగాలు మాత్రం ఎక్కువయ్యాయి.
రోగాలపాలు
కంపెనీ నుంచి వచ్చే దుమ్ము ఇళ్ల ఆవరణలో పెద్ద మొత్తంలో పేరుకుపోతోం దని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేదబావులు, వాటార్‌ట్యాంక్‌ల్లో సైతం దుమ్ము చేరి జనం అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది ఊపిరితిత్తులు, అస్తమా వ్యాధులకు గురవుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ముతో చిన్నారుల కంటి నుంచి నీరుకారుతోందని తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట గ్రామస్తులు నిద్రపోయిన తర్వాత కంపెనీ నుంచి దుమ్ము విపరీతంగా వదులుతున్నారు. ఉదయం చూసేసరికి ఇంటి ఆవరణలో, ఇంట్లో వస్తువులపై పెద్దఎత్తున దుమ్ము పేరుకుపోతోంది. యజమాన్యానికి అనేకసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలుష్య కోరల్లో కరన్‌కోట్
Published Sun, Jul 27 2014 12:04 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement