
సాక్షి, జనగామ: పవన్ కల్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయిలో చేతులపై కారులు పోవటం మనం చూశాం. అలాంటి సంఘటనే జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే కార్లు కాదండోయ్.. ఓ కరాటే మాస్టర్ తన కడుపుపై బైక్‌లు వెళ్లే సాహసానికి తలపెట్టారు. వివరాలివి.. జిల్లా కేంద్రంలోని సెయింట్ మెరీస్ ఉన్నత పాఠశాలలో ఎండీ అబ్బాస్ కరాటే మాస్టర్‌గా పనిచేస్తున్నాడు.
ఒకటి కాదు.. రెండు కాదు.. 1016 బైక్‌లను ఆయన తన కడుపు మీదుగా వెళ్లే సాహసానికి తలపెట్టారు. దాదాపుగా 18.44 నిమిషాల్లో 1016 బైకులు ఆయన పొట్టమీదుగా వెళ్లాయి. ప్రపంచ రికార్డు లక్ష్యంగా అబ్బాస్ ప్రదర్శన సాగింది.
Comments
Please login to add a commentAdd a comment