పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్
బాబు వ్యూహం మేరకే ఎమ్మెల్యేలతో బేరం
హన్మకొండ : టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరని, ఖబడ్దార్ అని టీడీపీ నాయకులను పార్లమెంట్ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు శ్రమిస్తుంటే.. ఆంధ్రా వారి మోచేతి నీళ్లు తాగుతూ విమర్శలు చేస్తారా అని వారి తీరును తూర్పారబట్టారు. పార్టీలోకి రాకముందు డీలర్ దయాకర్‌రావు, టీడీపీలోకి వచ్చాక డాలర్ దయాకర్‌రావు, తెలంగాణ వచ్చాక ప్యాకేజీల దయాకర్‌రావు అయ్యాడని దుయ్యబట్టారు. ఏపీలో వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ఫిరాయింపులు కావా అని ఆయన ప్రశ్నించా రు.
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ మహా సంకల్ప సభలో ఏపీ సీఎం చంద్రబాబు దిగజారి మాట్లాడారని అన్నారు. ఉప ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు జిల్లాకు క్యూ కట్టారని, వక్రభాష్యాలు మాట్లాడితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి ఎలా అవుతారని, టీడీపీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసి బయటకు వచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో నాయకులు మర్రి యాదవరెడ్డి, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్, మరుపల్లి రవి, కె.వాసుదేవరెడ్డి, చేవెల్ల సంపత్, క మరున్నీసా బేగం, జోరిక రమేశ్, కె.దామోదర్, బి.వీరేందర్, నాగపురి రాజేష్ పాల్గొన్నారు.
కేసీఆర్‌ను విమర్శిస్తే ఖబడ్దార్
Published Fri, Jun 12 2015 12:47 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement