
చక్రి మృతి పట్ల కేసీఆర్ దిగ్ర్భాంతి
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో విజయాలు సాధించిన తెలంగాణ బిడ్డ చిన్న వయసులో మరణించడం బాధాకరమని అన్నారు. చక్రి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చక్రి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.