చక్రికి ఇష్టమైన పాట ఇదే... | music director chakri's Melodious Journey | Sakshi
Sakshi News home page

చక్రికి ఇష్టమైన పాట ఇదే...

Published Mon, Dec 15 2014 9:50 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

music director chakri's Melodious Journey

హైదరాబాద్ : సంగీత దర్శకుడిగానే కాదు...గాయకుడిగా కూడా టాలీవుడ్‌లో చక్రికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు 50పాటలకు పైగా చక్రి పాడారు. ఇడియట్‌లో 'చూపులతో గుచ్చిగుచ్చి చంపకే', అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాలో 'నీవే నీవే నేనంటా'.... సత్యం సినిమాలో 'ఓ మగువ నీ స్నేహం కోసం ఎంతో ట్రై చేశా'...నేనింతే చిత్రంలో 'కృష్ణ నగరే మామ', గోపి గోపికా గోదావరి సినిమాలోని 'నువ్వెక్కడుండి  నేనక్కడుంటే ప్రాణం విలవిల' అనే  పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. మెలోడి, ఫాస్ట్‌ బీట్‌, డ్యూయెట్‌ అనే తేడా లేకుండా.... అన్ని రకాల పాటలు పాడి సంగీత ప్రియుల అభిమానాన్ని చక్రి సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా తమన్, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన పవర్‌ సినిమాలో కూడా ఓ హుషారైన పాటను పాడారు.

ఇక  ఎన్నో పాటలకు సంగీతం అందించిన చక్రికి ఏ పాట అంటే ఇష్టమో తెలుసా ?  ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రంలో 'మల్లికూయవే' పాట  అంటే ఇష్టం. అలాగే చక్రం సినిమాలోని 'ఒకే ఒక మాట..మదిలోనే దాగుంది మౌనంగా' అనే పాట చాలా ఇష్టమని గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


పల్లవి :
మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
మల్లి కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా

విధివరమే నీవేగా నీవేగా...
కలనిజమై పూచేగా పూచేగా...
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా... జువ్వా... జువ్వా...
మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా

చరణం : 1
సిరిసిరి మువ్వలా చిరుసడివించే స్మృతి పదమున నీ గానమే
సిరిసిరి మువ్వలా చిరుసడివించే స్మృతి పదమున నీ గానమే
పొంగిపారె ఏటిలో తొంగి తొంగి చూస్తె తోచెను ప్రియ నీ రూపమే
సోకేటి పవనం నువు మురిపించే గగనం
కోనేటి కమలం లోలో నీ అరళం
కలత నిదురలో కలలాగ జారిపోకె జవరాల
నీలి సంద్రమున అలలాగ
హృదయలోగిలో నువ్వా... నువ్వా... నువ్వా...
మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా

చరణం : 2
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
కృంగెను ఎద నీ కోసమే
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
కృంగెను ఎద నీ కోసమే
సాగిపోయె దారిలో వేసే ప్రతి అడుగులా తగిలెను నీ మృద పాదమె

ఎగిసేటి కెరటం చేరేలే తీరం
చీకటిలో పయనం నువ్వేలే అరుణం
వలపు వరదలో నదిలాగ తడిపిపో జడివానలా
మంచుతెరలలో తడిలాగ
నయన చిత్తడిలో నువ్వా... నువ్వా... నువ్వా...
మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా
విధివరమే నీవేగా నీవేగా...

కలనిజమై పూచేగా పూచేగా...
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా... జువ్వా... జువ్వా...
మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement