కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలి
► పార్టీని నమ్మిన వారికి
► ఉత్తమ భవిష్యత్ కాంగ్రెస్ జిల్లా
► ఇన్‌చార్‌జ రంగారెడ్డి సోనియాగాంధీ
► చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలి
► ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి
పాలమూరు: కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి రంగారెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాజీ ఎంపీ విఠల్‌రావు అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. కొంతమంది అధికార దాహంతో, కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి అధికార పార్టీలో చేరారని విమర్శించారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో పార్టీ టికెట్ ఇస్తుందని అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో త్వరలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 లక్షల ఇండ్లు నిర్మిస్తే డబుల్ బెడ్‌రూం పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్‌రూం మంజూరు చేయలేదన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య మాటలకే పరిమితం అయ్యిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ లోపాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు.
నెరవేరని హామీలు
అంతకు ముందు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య మాట్లాడుతూ రెండు సంవత్సరాల పాలన ముగిసినా కేసీఆర్ వాగ్ధానాలన్నీ అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి, తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణను వ్యతిరేకించిన తుమ్మల, శ్రీనివాస్‌యాదవ్, డీఎస్ లాంటి వారికి మంత్రి పదవులిచ్చి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినకోదండరాంను విస్మరించారని అన్నారు.
కమిటీలు పూర్తిచేయాలి
డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ జూన్ 21 నాటికి గ్రామ, మండల, తాలూకా కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండామణెమ్మ, మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధాఅమర్, నిజాంపాషా, పటేల్ వెంకటేష్, వివిధ నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
సోనియా ఇవ్వడంతోనే..
ఎఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలి తంగా సోనియాగాంధీ ఇవ్వడం వల్లనే తెలంగాణ రాష్టం వచ్చిందని, ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయాలు, ముఖ్య కూడళ్లలో సో నియాగాంధీ చిత్రపటాలకు పాలాభిషే కం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసారంగానికి, రైతాం గానికి ఏ ప్రభుత్వం చేయలేనంత అన్యాయం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చే స్తుందని అన్నారు. కరువు సహాయ చర్యలు చేపట్టడం లేదని, రైతులను పట్టించుకోవడం లేదని, కేంద్రం నిధు లు ఇచ్చినా ఖర్చు పెట్టలేని స్థాయిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తయ్యారైందని అన్నారు. ప్రభుత్వంపై రైతులు చాలా కోపంగా ఉన్నారని రైతుల పక్షాన నిల బడి పోరాటం చేయాలని అన్నారు.