సాక్షి, వనపర్తి: వనపర్తి శివారులోని నాగవరంలో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీ ఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. ముందస్తు ఎన్నికల వేళ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారపర్వాన్ని మరింత ముమ్మ రం చేయనున్నారు. సభా వేదిక నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాం గ్రెస్ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్న జిల్లెల చిన్నారెడ్డి, డీకే అరుణ, రేవంత్‌రెడ్డిపై విమర్శల ఎక్కుపెట్టారు. అదే సమయంలో టీడీ పీని టార్గెట్ చేసిన తీరు గులాబీ శ్రేణుల్లో ఉత్సా హం నింపింది. దీనికితోడు ప్రాజెక్టులు, సాగునీటి వాటాల్లో గతంలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సీఎం కేసీఆర్ ఎత్తిచూపారు. మహ బూబ్‌నగర్ అనగానే కరువు, వలసలు, లేబర్ జిల్లా, పెండింగ్ ప్రాజెక్టుల జిల్లాగా పేరు పడిందని వివరిస్తూనే ఉమ్మడి జిల్లా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
స్పీడు పెంచిన కారు
రాష్ట్రంలో జరిగే ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. నవంబర్ 12న నోటిఫికేషన్, డిసెంబర్ 7న ఎన్నికలు, 11న ఫలితాలు విడుదలకానున్నాయని ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించడంతో ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ తరఫున ఇప్పటికే ప్రకటించిన 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారంలో మరింత వేగం పెంచనున్నారు. జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. కేసీఆర్ వారిపై విమర్శలు గుప్పించి గతంతో వారు అధికారంలో ఉండగా జిల్లా అభివృద్ధికి ఏం చేశారో.. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసిందో చెప్పేందుకు ప్రయత్నించారు. నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తోడు కేసీఆర్‌కు ఉన్న ఛరిస్మా తమను గెలిపిస్తుందని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సాగునీరు గెలిపిస్తుందనే ధీమా..
కేసీఆర్ తన ప్రసంగంలో ఎక్కువగా ప్రాజెక్టులు, సాగునీరు అంశాన్ని ప్రస్తావించాడు. ప్రస్తుత ఎన్నికల్లో సాగునీరే టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు రాలుస్తుందనే ధీమాలో ఉన్నట్లు కనిపించింది. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమాతో పాటు పలు ప్రాజెక్టుల్లో అధికశాతం పనులు పూర్తయ్యాయి. కానీ అప్పటికీ అవి అసంపూర్తిగానే ఉండటంతో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేశారు.
కేఎల్‌ఐ ద్వారా నీటి లభ్యత 25 టీఎంసీలే ఉన్నా దానిని 40 టీఎంసీలకు పెంచారు. నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ నింపడానికి రిజర్వాయర్లు అందుబాటులో లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి చెరువులు నింపుతున్నారు. తద్వారా సాగు బాగా పెరగింది. ఈ ఏడాది పాలమూరు జిల్లాలో అందుబాటులో ఉన్న జూ రాల, కేఎల్‌ఐ, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా తదితర కాల్వల ద్వారా సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందినట్లు టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి అధికారం దక్కితే పెండింగ్‌లో ఉన్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేసి పాలమూరులో 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చి మరో కోనసీమలా మారుస్తామని ప్రజలకు హామీఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment