గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
బడ్జెట్ సమావేశాలు.. మంత్రివర్గ విస్తరణపై మంతనాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం రాత్రి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకుని మరోసారి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు గవర్నర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆయన గవర్నర్‌కు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అలాగే అక్టోబర్, నవంబర్ నెలలకు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వ్యయం చేయడానికి అనుమతించాలని మంత్రుల నుంచి సర్క్యులేషన పద్ధతిలో అనుమతి తీసుకుని పంపిన ఫైలును ఆమోదించాలని కూడా గవర్నర్‌ను కేసీఆర్ కోరినట్టు తెలిసింది. ఈ రెండు నెలల కోసం 15 వేలకోట్లకుపైగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు వినియోగించుకుంటామని కోరారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు దసరా పండుగ తరువాత నిర్వహించనున్న విషయాన్ని గవర్నర్‌కు వివరించినట్టు తెలి సింది.
ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరుపున, తన తర ఫున శుభాకాంక్షలు తెలిపారు.