
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. కంటి, పంటి వైద్య పరీక్షల కోసం ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఈ రోజు ఉదయం కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే నిజాముద్దీన్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు దంత పరీక్షలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండనున్న నేపథ్యంలో.. వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడానికి ఆయన ఢిల్లీ వెళ్లినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment