'రెండు.. మూడు రోజులే ఉండి పోతుందిలే అనుకున్నా'
హైదరాబాద్ : రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ పట్టి పీడిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం సచివాలయంలో స్వైన్ ఫ్లూపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించాచారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... స్వైన్ ఫ్లూపై వార్తకథనాలు విరివిగా వుస్తుంటే .... స్వైన్ ఫ్లూ రెండు మూడు రోజులే ఉండి పోతుందిలే అనుకున్నా... కానీ పరిస్థితి వేరుగా ఉందన్నారు.
సైబీరియా చలిగాలులు మరో 20 రోజులు ఉండే అవకాశం ఉంది... దాంతో స్వైన్ ఫ్లూ మరింత విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో యుద్ధం ప్రకటించాల్సి ఉందని తెలిపారు. కేంద్ర సహకారంతో స్వైన్ ఫ్లూను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. ఈ రోజు సాయంత్రం 3 గం.లకు కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 5.00 గంలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.