ఆ రెండింటినీ హుస్సేన్సాగర్లా మార్చకండి
గండిపేట, హిమాయత్సాగర్ జంట జలాశయాల్లో కలుషిత నీరు చేరుతోందని, ఆ రెండూ మరో హుస్సేన్సాగర్లా మారకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో ఆయన గురువారం నాడు సమీక్షించారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువులన్నింటినీ పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కనీసం 12 నుంచి 15 డంపింగ్ యార్డులను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. డంపింగ్ యార్డుకు వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలని తెలిపారు. నగర పరిధిలో పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరచాలని ఆయన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు.