కొరత ఉన్నప్పుడు ఏమిటీ నిర్ణయాలు?
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కోతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకమేనని తెలంగాణ సర్కారు మండిపడుతోంది. ఒకవైపు విద్యుత్ కొరత ఉన్న పరిస్థితుల్లో వార్షిక మరమ్మతుల పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ అంశంపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన విద్యత్ కొరత పెట్టుకుని వార్షిక మరమ్మతుల పేరుతో విద్యుత్ నిలిపివేయడం సమంజసం కాదన్నారు. ఆ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 146 మిలియన్ యూనిట్ల (ఎంయు)వరకు ఉండగా... సరఫరా 123 ఎంయులుగా ఉంది. మిగిలిన 23 ఎంయుల మేరకు భారీగా కోతలు అమలు చేయాల్సి వస్తోంది. ఈ స్థాయిలో విద్యుత్ లోటు ఉన్నప్పుడు... 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్‌టీపీపీ) ఒక యూనిట్‌ను, విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్‌టీటీపీఎస్)లో 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లను వార్షిక మరమ్మతుల పేరుతో నిలిపివేయడాన్ని ఆయన తప్పుపట్టారు. దీంతో మొత్తం 630 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా వాటా మేరకు తెలంగాణకు రావాల్సిన 53.89 శాతం విద్యుత్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఒకవైపు కరెంటు కోతలు ఉంటే యూనిట్లను వార్షిక మరమ్మతుల పేరిట ఎలా నిలిపివేస్తారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చర్య అనైతికం, అక్రమం అంటూ కేంద్రానికి చేసిన ఫిర్యాదులో కేసీఆర్ మండిపడ్డారు.
తక్షణమే ఈ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యుత్ కొరమెదక్ జిల్లాలో రైతులపై లాఠీచార్జ్ చేయడం అమానుష చర్యని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కొరతకు గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమన్నారు. పరిశ్రమలు, ఇంటి కోతలు విధించి అయినా రైతులకు విద్యుత్ సరఫరా చేయలన్నారు.