గురువారం గన్‌పార్క్‌లోని అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు ముందు సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రగతిభవన్ నుంచి బయలుదేరి 11 గంటలకు నేరుగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ సీఎం సహా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు.
అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అక్కడి నుంచి అసెంబ్లీ ఆవరణలోని మైసమ్మ గుడి వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం శాసనసభలోకి చేరుకున్నారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ కూడా సీఎంకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment