'బ్రహ్మంగారిలాగే కేసీఆర్ భవిష్యత్ ను ఊహించగలరు' | KCR will assume future like Veera brahmedra swamy | Sakshi
Sakshi News home page

'బ్రహ్మంగారిలాగే కేసీఆర్ భవిష్యత్ ను ఊహించగలరు'

Published Tue, Nov 4 2014 9:24 AM | Last Updated on Tue, Nov 6 2018 4:32 PM

'బ్రహ్మంగారిలాగే కేసీఆర్ భవిష్యత్ ను ఊహించగలరు' - Sakshi

'బ్రహ్మంగారిలాగే కేసీఆర్ భవిష్యత్ ను ఊహించగలరు'

ధర్మారం: బ్రహ్మంగారిలాగే స్వర్గీయ ఆచార్య జయశంకర్, ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ ను ఊహించగలరని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. పోతులూరి వీరబ్రహేంద్రస్వామిని నిత్యం స్మరించుకుంటే భవిష్యత్తులో ముందుకు పోగలుగుతామన్నారు. 
 
1952-53లో తెలంగాణను ఆంధ్రరాష్ట్రంలో కలిపే ప్రతిపాదనలను జయశంకర్ వ్యతిరేకిస్తూ భవిష్యత్ లో జరగబోయే పరిణామాలను అప్పడే వివరించారని గుర్తు చేశారు. కేసీఆర్ సైతం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటం తథ్యమని చెప్పి రాష్ట్రాన్ని సాధించారన్నారు. 
 
కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో సోమవారం జరిగిన జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, దాసరి మనోహర్ రెడ్డి, కలెక్టర్ ఎం వీరబ్రహ్మయ్యలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement