ముగిసిన కేసీఆర్ మేధోమధన సదస్సు!
ముగిసిన కేసీఆర్ మేధోమధన సదస్సు!
Published Mon, Jul 7 2014 11:42 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో నవ తెలంగాణ ఏర్పాటుపై నిర్వహించిన మేధోమథన సదస్సు ముగిసింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగ క్యాంపస్ లో ఈ సదస్సు జరిగింది.
ఈ సదస్సు ముగిసిన తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ.. జూలై 12 నుంచి 17వరకు గ్రామస్థాయి సమావేశాలను నిర్వహిస్తామన్నారు. అలాగే ఆగస్టులో జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రణాళికా సమావేశాలు జరుపాలని అధికారులకు సీఎం కేసిఆర్ సూచించారు.
తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్ నుంచి ఎంపీ వరకూ అందర్నీ భాగస్వామ్యం చేయాలన్నారు.ఇప్పటికే నెలరోజుల పాటు అన్ని శాఖలపై సమీక్ష జరిపానని కేసీఆర్ తెలిపారు.
Advertisement
Advertisement