మీ నమ్మకాన్ని వమ్ము చేయను | Kept on the confidence of his people | Sakshi
Sakshi News home page

మీ నమ్మకాన్ని వమ్ము చేయను

Published Fri, Jun 13 2014 2:31 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

మీ నమ్మకాన్ని వమ్ము చేయను - Sakshi

మీ నమ్మకాన్ని వమ్ము చేయను

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
 
మధిర: జిల్లా ప్రజలు తనపై నమ్మకంతో వేసిన ఓటును వృథా కానివ్వనని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ మధిర నియోజకవర్గం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రెడ్డి గార్డెన్స్ కల్యాణ మండపంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని, జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జిల్లాకు అధిక నిధులు తీసుకొచ్చి శక్తివంచన లేకుండా అభివృద్ధి చేస్తానన్నారు. తెలంగాణ ప్రజలకు సేవచేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో యావత్ తెలంగాణ ప్రజలు ఖమ్మం పార్లమెంట్ వైపే చూశారని అన్నారు.
 
అయితే విజయం సాధించినప్పటికీ.. వివిధ కారణాలతో ఆశించినంత మెజార్టీ రాలేన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినప్పటికీ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్ సీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారని చెప్పారు. ఏదేమైనా ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా కృషి చేస్తానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మాట తప్పనని హామీ ఇచ్చారు. తన సత్తా ఏమిటో చూపిస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించారు. బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాల విషయంలో ప్రభుత్వానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, అందుకే జిల్లాలో ఎంపీతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నామని చెప్పారు. పార్టీ శ్రేణులకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. మీ శీనన్నగా ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటానన్నారు. తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు జెవీ రెడ్డి, తూమాటి నవీన్‌రెడ్డి, వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో పొంగులేటిని సన్మానించారు.
 
ముందుగా పొంగులేటికి పూర్ణకుంభంతో పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పొంగులేటిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమావేశ ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. పార్టీ జిల్లా నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, నాయకులు యన్నం కోటేశ్వరరావు, తూమాటి నర్సిరెడ్డి, వేమిరెడ్డి ల క్ష్మారెడ్డి, చావా హన్మంతరావు, బండి వెంకటేశ్వ ర్లు, అంకసాల శ్రీనివాసరావు, లకిరెడ్డి నర్సిరెడ్డి, కోట నిర్మలజ్యోతి, కొట్టె విజయలక్ష్మి, వేమిరెడ్డి త్రివేణి, కొప్పుల నాగేశ్వరరావు, మునుగోటి వెం కటేశ్వరరావు, అబ్బూరి రామకృష్ణ పాల్గొన్నారు.
 
సమస్యల పరిష్కారానికి గళమెత్తుతా
 
కల్లూరు : జిల్లాలోని ప్రధాన సమస్యలను పార్లమెంట్‌లో వినిపించి వాటి పరిష్కారం కోసం పోరాడుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి చెప్పారు. గురువారం ఆయన కల్లూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రమాదం దురదృష్టకరమని, తాము అక్కడికి వెళ్లి పరిశీలించామని, గల్లంతయిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల బాధ వర్ణనాతీతంగా ఉందని తెలిపా రు. గల్లంతయిన, మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
 
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు. ప్రజా సంక్షేమంకోసం చేపట్టే ప్రతిపనికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుం దన్నారు. సమావేశంలో కల్లూరు సర్పంచ్ భరోత్ సుజాత, వైస్ సర్పంచ్ బొలగాని తిరుపతిరావు, ఎంపీటీసీ అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కీసర వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ పాలెపు రామారావు, నాయకులు కర్నాటి అప్పిరెడ్డి, పెద్దబోయిన శ్రీనివాసరావు, ఉబ్బన గోపాలస్వామి, అత్తునూరి సత్యనారాయణరెడ్డి, మేకల కృష్ణ, పాలడుగు శంకర్‌రావు, భరోత్ రాము, బుర్రి వీరయ్య, ఉబ్బన శ్రీను, ధరావత్ మోహన్, వెంగళ పెంటయ్య, కమల్, లక్కిరెడ్డి యేసురెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement