టీఆర్‌ఎస్ ఎంపీ కేకే కీలక నిర్ణయం
హైదరాబాద్: ఇబ్రహీపట్నం మండలం దండుమైలారంలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ తమ కుటుంబం గోల్డ్‌స్టోన్ ప్రసాద్ నుంచి కొనుగోలు చేసిన 36 ఎకరాల సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఇందుకు ప్రతిగా తాము భూములు కొనుగోలుకు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని ఆయన కోరుతున్నారు. అవసరమైతే ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించి.. తమకు భూమిని అమ్మినవారికి నోటీసులసు ఇస్తామని కేకే చెప్తున్నారు. సొంత టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరితో పోదల్చుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఇక్కడ 36 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. ఈ నేపథ్యంలో సేల్ డీడ్ రద్దుచేసుకోవాలని కేకే నిర్ణయించారు.