
ఓరుగల్లు కోటలో పతంగుల పండుగ
వరంగల్ : వరంగల్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఓరుగల్లు కోటాలో పతంగుల ర్యాలీని కలెక్టర్ ఆమ్రపాలి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విదేశీ క్రీడాకారులు, యువత, చిన్నారులు పాల్గొన్నారు.
అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన కైట్ ఫెస్టివల్‌లో 31 దేశాలకు చెందిన 5,000కు పైగా క్రీడాకారులు పాల్గొని పతంగులు ఎగురవేశారు. తొలిసారిగా వరంగల్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడంతో కలెక్టర్ ఆమ్రపాలిని నగరవాసులు ప్రత్యేకంగా అభినందించారు.