వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న డాక్టర్ రఘువీర్‌రెడ్డి. చిత్రంలో అనంత్‌జోషి
సాక్షి, హైదరాబాద్: మోకీళ్ల మార్పిడి చికిత్సకు హైటిబియల్ అస్టియోటొమి (హెచ్‌టీఓ), మెనిస్కస్ రూట్ రిపేర్, కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్ ప్రత్యామ్నాయమని సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ఆర్థోస్కోపీ (సీసా) ఆసుపత్రి సీనియర్ షోల్డర్ అండ్ నీ సర్జన్ డాక్టర్ రఘువీర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లకు తోడు క్రీడల్లో గాయాలు, రోడ్డు ప్రమాదాలతో చిన్న వయసులోనే అనేక మంది మోకీళ్ల నొప్పుల బారిన పడుతున్నారన్నారు.
ఇలాంటి వారికి ఇప్పటి వరకు మోకీళ్ల మార్పిడి సంప్రదాయంగా వస్తుందని, ప్రస్తుతం వీటికి ప్రత్యాయ్నాయ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సీసా ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ‘అడ్వాన్స్‌డ్ నీ కోర్స్–2018’లైవ్ సర్జరీ వర్క్‌షాప్ నిర్వహించారు. దేశ, విదేశాలకు చెందిన సుమారు 200 మంది ఆర్థోపెడిక్ వైద్యులు ఇందులో పాల్గొన్నారు. ప్రాన్స్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ పాస్కల్ క్రిస్టల్ సహా పలువురు వైద్య నిపుణులు.. మోకీలు మార్పిడి చికిత్సలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, చికిత్సలో అనుసరించాల్సిన మెళకువలను వివరించారు.
ఈ సందర్భంగా రఘువీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 55 ఏళ్లలోపు బాధితులకు మోకీలు మార్పిడి చికిత్సలు నష్టం చేకూర్చుతున్నాయని, ఇలాంటి వారికి నొప్పి తక్కువగా ఉండే హెచ్‌టీఓ ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పారు. కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్ 15 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ పద్ధతిలో కత్తిగాటుతో పని లేకుండా మోకీళ్లను యథాస్థితికి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment