ఉత్తమ్‌పై కోమటిరెడ్డి ఫైర్
నకిరేకల్(నల్గొండ జిల్లా):
నల్గొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. నకిరేకల్‌లో విలేకరులతో మాట్లాడుతూ..తప్పుడు సర్వేలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించ వద్దని ఉత్తమ్‌కు సూచించారు. గడ్డాలు మీసాలు పెంచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ 2019లో గెలుపొందలేదన్నారు.
ముందు ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఉత్తమ్‌కు కోమటి రెడ్డి సూచించారు. వచ్చే ఎన్నికల వరకు సీఎల్పీగా తానే ఉంటానని ఉత్తమ్ చెప్పుకోవడం పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎప్పుడు ఊడిపోతాయో ఎవ్వరికీ తెలియదు అని జోస్యం చెప్పారు.