కోర్ట బ్యారేజీ వద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ డి.దివ్యదేవరాజన్
జైనథ్(ఆదిలాబాద్) : కోర్ట–చనాఖా బ్యారేజీ, హట్టిఘా ట్ పంప్‌హౌస్ పనులను గడువులోగా పూర్తి చేసేందు కు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డి.దివ్యదేవరాజన్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించా రు. మంగళవారం ఆమె మండలంలోని కోర్ట–చనాఖా బ్యారేజీ, హట్టిఘాట్ పంప్‌హౌస్, లోయర్ పెన్‌గంగ పనులు పరిశీలించారు. వచ్చే జూన్‌లోగా పనులు పూర్తి చేసేందుకు చేపడుతున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. కోర్ట–చనాఖా బ్యారేజీ వద్ద మొత్తం 22 పియర్స్(పిల్లర్ల) పనులు ప్రారంభించామని, అవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఇరిగేషన్ ఎస్‌ఈ అంజద్ తెలిపారు. పంప్‌హౌస్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మొత్తం పంప్‌ల ఏర్పాటు పూర్తయిందని, మోటార్లు బిగించడానికి కోసం వాల్ పనుల కొనసాగుతున్నాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌లోగా పనుల పూర్తి చేసి ట్రయల్ రన్ చేపడతామని కలెక్టర్‌కు వివరించారు. బ్యారేజీ ద్వారా 13,500 ఎకరాలకు, పంప్‌హౌస్ ద్వారా 37,500 ఎకరాలకు కలిపి మొత్తం 51వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు. దీనికోసం 47కిలోమీటర్ నుంచి 89 కిలోమీటర్ వరకు లోయర్ పెన్‌గంగ కెనాల్ నిర్మిస్తున్నామని, ఆ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
పరిహారం పెంచాలని విన్నపాలు...
కోర్ట–చనాఖా బ్యారేజీ భూ సేకరణ కోసం చెల్లించే పరిహారాన్ని పెంచాలని నిర్వాసితులు కలెక్టర్‌కు విన్నవించారు. బ్యారేజీ పరిశీలనకు వచ్చిన కలెక్టర్‌ను కోర్ట గ్రామస్తులు కలిశారు. బ్యారేజీ కోసం మొదటి విడతలో 126 ఎకరాలు సేకరించారని, గరిష్టంగా ఎకరానికి రూ.5.75లక్షలు మాత్రమే చెల్లించారని అన్నారు. మహారాష్ట్ర భూములు రూ.11లక్షల వరకు చెల్లించారని అన్నారు. ప్రస్తుతం రెండవ విడతలో మరో 32 ఎకరాలు సేకరిస్తున్నారని, తమకు కూడా ఎకరానికి రూ.11లక్షల పరిహారం అందించాలని కోరారు. బ్యారేజీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారికి, గ్రామంలో రోడ్డు వెంబడి ఉన్న కుటుంబాలకు డబుల్ బెడ్ రూంలు నిర్మించి ఇస్తామని చెప్పారని.. ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. బ్యారేజీ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం రాకుండా పూర్తి ఊరినే తరలించాలని, మొత్తం 200 డబుల్ బెడ్‌రూంలు మంజూరు చేస్తే, వేరే చోటు ఇళ్లు నిర్మించుకుంటామని అన్నారు. జిల్లా నీటి పారుదల శాఖ అధికారి సుశీల్‌కుమార్, ఆర్డీవో సూర్యనారాయణ, డీఈ మనోహర్, ఏఈఈలు సుజాత, శృతి, నాయకులు బొల్లు అడెల్లు, మహేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment