
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా స్పందించే కేటీఆర్.. గతంలో పలువురికి సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కష్టాల్లో ఉన్న చిన్నారులకు తనవంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ పేరుతో ఓ వ్యక్తి నిరాశ్రయులైన చిన్నారులను చేరదీసి వారికి అండగా నిలబడ్డాడు. చాలా కాలంగా పిల్లల బాగోగులు చూసుకుంటున్న ఆ వ్యక్తికి ఇటీవల కాలంలో నిధుల కొరత తలెత్తడంతో వారి పోషణ భారంగా మారింది. దీంతో ఆ పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
అయితే ఆ పోస్టు చూసిన కేటీఆర్ స్పందించారు. ఆ పిల్లలకు తన వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు అందజేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ఆ మొత్తానికి సంబంధించిన చెక్‌ను ఎవరికి అందజేయాలో తెలుపాల్సిందిగా ఆ నెటిజన్‌ను కోరారు. దీంతో ఆ నెటిజన్ వారి వివరాలను కేటీఆర్‌కు పంపించారు.
I’ll contribute 10 lakhs in personal capacity. Who & where do I send the cheque to? https://t.co/t5bNu3GFKk
— KTR (@KTRTRS) 6 November 2018
Comments
Please login to add a commentAdd a comment