కేసీఆర్‌ తాత నిన్ను పాస్‌ చేసిండుపో..  | KTR Funny Talk With Child In Hyderabad | Sakshi
Sakshi News home page

బాలుడితో మంత్రి కేటీఆర్‌ చమత్కారం 

Published Fri, Apr 17 2020 1:55 AM | Last Updated on Fri, Apr 17 2020 1:55 AM

KTR Funny Talk With Child In Hyderabad - Sakshi

ఖైరతాబాద్‌: కరోనా వైరస్‌ను అరికట్టే దిశలో భాగంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌ను కంటైన్మెంట్‌ జోన్‌ కింద చేర్చి పూర్తిగా నిర్బంధించారు. ఈ కంటైన్మెంట్‌ జోన్‌లో గురువారం మంత్రి కేటీఆర్‌ పర్యటించి స్థానికులతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ భవనం మేడపై ఉన్న ఆర్యన్‌ అనే బాలుడిని కేటీఆర్‌ పలకరించారు. ఏం చదువుతున్నావ్‌ అని మంత్రి ఆ బాలుడిని ప్రశ్నించగా తాను 5వ తరగతి చదువుతున్నానని బాలుడు సమాధానమిచ్చాడు. అప్పుడు నువ్వు పరీక్షలు రాయకుండానే కేసీఆర్‌ తాత నిన్ను పాస్‌ చేసిండు పో అని మంత్రి కేటీఆర్‌ అనగా అక్కడ ఉన్న అధికారులతో సహా అందరూ నవ్వేశారు. ఇంట్లో ఎవరికీ బోర్‌ కొట్టకుండా నువ్వే ఎంటర్‌టైన్‌ చేయాలంటూ కేటీఆర్‌ ఆ బాలుడితో చమత్కరించి వెళ్ళిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement