కన్నారెడ్డి ఘటనపై విచారణకు కేటీఆర్ ఆదేశం
ఈ వార్త ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంతో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఏఓ నీరజపై జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ విచారణకు ఆదేశించారు. కాగా.. పోలీసుల దెబ్బలకు తీవ్ర అస్వస్థతన గురైన కన్నారెడ్డికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ కేసుపై స్పందించిన మంత్రి కేటీఆర్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. కాగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు, వ్యవసాయాధికారిపై సొంత శాఖకు చెందిన ఉన్నతాధికారులే విచారణ చేస్తుండడంతో న్యాయం జరగదని బాధితులంటున్నారు. మెజిస్ట్రీరియల్ విచారణ చేయించాలని ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు.