
మారిషస్ ప్రధానితో కేటీఆర్ భేటీ
ఆవిష్కరణలు, పర్యాటకం, నైపుణ్య రంగాల్లో భాగస్వామ్యంపై చర్చ
సాక్షి, హైదరాబాద్: ముంబై పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం మారిషస్ ప్రధానమంత్రి అనెరుధ్ జుగ్నాథ్‌తో సమావేశ మయ్యారు. ఆవిష్కరణలు, పర్యాటకం, నైపుణ్యం, ఆయుష్ రంగాల్లో పరస్పర భాగ స్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. రెండేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. తెలంగాణలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాల కోసం టాస్క్ ఏర్పాటు చేసి చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యా ర్థులు, యువకులను ఉద్యోగార్థులుగా తీర్చిది ద్దే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని కేటీఆర్ చెప్పారు.
పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య వారిధిగా వ్యవహరిస్తూ టాస్క్ ఆధ్వ ర్యంలో చేపడుతున్న శిక్షణా కార్యక్రమాల వివరాలను పంచుకున్నారు. అదే విధంగా నైపుణ్య శిక్షణా రంగంలో మారిషస్ అద్భు తమైన ప్రగతి సాధించిందని కొనియాడిన కేటీఆర్ ఆ అనుభవాలను తెలంగాణతో పంచుకోవాలని కోరారు. ఇందుకోసం అధి కారికంగా ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కేటీఆర్ ఆసక్తి కనబరిచారు.
పర్యాటక రంగంలో సహకారం
ఆవిష్కరణల రంగంలో దేశానికే రోల్‌మోడల్ గా నిలిచిన టీ-హబ్ ఈ మధ్యే ఏడాది పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. దేశంలో ఇన్నో వేషన్ ఎకో వ్యవస్థను టీ-హబ్ బలోపేతం చేసిందని, విజయవంతమైన ఈ ప్రయో గాన్ని విసృ్తతపర్చేందుకు టీ-హబ్-2ను నిర్మిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ, మారిషస్ మధ్య అవగాహన ద్వారా ఈ రంగంలో పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతేగాకుండా తెలంగాణ నుంచి మారి షస్‌కు పర్యాటకులు భారీగా వెళతారని, తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు మారి షస్‌కు పరిచయం చేసేందుకు ఈ పరిణామా న్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగంలో తెలంగాణ, మారిషస్ పరస్పరం సహకరించుకోవాలని కేటీఆర్ కోరారు.
తెలంగాణ ప్రగతి అభినందనీయం
జుగ్నాథ్ మాట్లాడుతూ పలుసార్లు తెలంగాణ ను సందర్శించిన తమ దేశ ప్రతినిధి బృం దాలు ఇక్కడి విధానాల గురించి సానుకూల త వ్యక్తం చేశాయన్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన రెండేళ్లలోనే తెలంగాణ సాధించిన ప్రగతి అభినందనీయమన్నారు. విభిన్న రం గాల్లో అభివృద్ధి దిశగా దూసుకెళుతున్న తెలంగాణలాంటి రాష్ట్రంతో పరస్పర అవగా హనకు, భాగస్వామ్యానికి మారిషస్ సిద్ధంగా ఉంటుందని కేటీఆర్‌కు హామీ ఇచ్చారు.