
కృష్ణమూర్తికి జ్ఞాపిక అందజేస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుబ్రహ్మణ్యన్‌తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. దేశ ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు.
పారిశ్రామిక రంగం పురోగతి, పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను కేటీఆర్ వివరించారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక విజయాలు నమోదు చేసిందన్నారు. కేంద్రం విధానపరంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ కోరారు. గతంలో హైదరాబాద్ ఐఎస్‌బీలో పనిచేస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యన్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment