అలంపూర్ అభివృద్ధికి మంత్రి హామీ | ktr promises to alampur temple development | Sakshi
Sakshi News home page

అలంపూర్ అభివృద్ధికి మంత్రి హామీ

Published Tue, Oct 6 2015 1:36 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

ktr promises to alampur temple development

అలంపూర్‌: తెలంగాణలోని శక్తి పీఠం అలంపూర్ ఆలయాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ నుండి హామీ లభించిందని దేవస్థాన చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, ఈవో గురురాజలు తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం కార్యాలయ చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రిని ఆహ్వానించేందుకు వెళ్లగా అలంపూర్ ఆలయాలను యాదగిరి, వేములవాడ తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే ఒకదాని తరువాత ఒకటి అభివృద్ది జరుగుతుందని అంతవరకు కొంత సంయమనం పాటించాల్సిందిగా కోరినట్టు తెలిపారు. కేటీఆర్ ను కలసిన వారిలో దేవస్థాన ఈవో నరహరి గురురాజ, దర్మకర్తలు,  అర్చకులు తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement