సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా... ఆయన తనయుడు, మంత్రి కె.తారకరామారావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తమకు ఆదర్శం అని పేర్కొన్నారు. ఈ మేరకు... ‘‘ నాకు తెలిసిన ధైర్యశాలి.., విలక్షణ వ్యక్తిత్వం గల, దయామయుడైన.. చరిష్మా గల వ్యక్తి.. ఆయనను నాన్నా అని పిలవడానికి నేనెంతో గర్విస్తాను.. మీరు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్థిల్లాలి. దూరదృష్టి, నిబద్ధత కలిగిన మీరు.. ఇలాగే కలకాలం మాకు ఆదర్శంగా నిలవాలి. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అదే విధంగా నిజామాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు సైతం ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కాగా సోమవారం సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో జలవిహార్‌లో జరుగుతున్న కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మొక్కను నాటి.. అనంతరం దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన కేసీఆర్ ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తూ ఆహ్లాదంగా గడిపారు. అదే విధంగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ... పలువురు ప్రముఖులు నగరంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి అభిమానం చాటుకుంటున్నారు. మరోవైపు.. దక్షిణాఫ్రికా, మలేషియా తదితర దేశాల్లో సైతం టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం నాయకులు కేసీఆర్ బర్త్‌డేను ఘనంగా నిర్వహిస్తున్నారు.
సౌతాఫ్రికాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
To the most Versatile, Courageous, Compassionate, Charismatic & Dynamic man that I know; The man who I am proud to call my Father 😊
— KTR (@KTRTRS) February 17, 2020
May you live long & may you continue to inspire us all with your vision & commitment
తల్లిని కన్న తనయుడికి
జన్మదిన శుభాకాంక్షలు#HappyBirthdayKCR pic.twitter.com/YP8whlAqQd
Comments
Please login to add a commentAdd a comment