టీ-సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో చేపట్టే భూ సేకరణలో పారదర్శకత, నష్ట పరిహా రం చెల్లింపు, పునరావాస కార్యక్రమాలకు అనుసరించాల్సిన విధానంపై అధ్యయనానికి తెలంగాణ సర్కారు ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధ్యక్షునిగా ఏర్పాటైన ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, తారక రామారావు, జోగు రామన్న ఉంటారు.
సీఎం ప్రత్యేక కార్యదర్శిగా భూపాల్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి కె. భూపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
భూ సేకరణ విధానంపై మంత్రుల కమిటీ
Published Thu, Jul 3 2014 4:14 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
Advertisement