ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలోని వివిధ బ్యాంకులు రైతులకు పంట రు ణాలు మంజూరు చేయడంలో ఇతర జిల్లాల కంటే వెనుకంజలో ఉన్నాయని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాం కర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు పంట రుణాలు అందించాలని ప్రభుత్వం పదేపదే చెబుతోందని, రుణ మాఫీ కూడా చేసిందని పేర్కొన్నారు. అయినా కొత్త పంట రుణాల మంజూరులో మన జిల్లా వెనుకబడి ఉందని తెలిపారు. జిల్లాలో భూములు లేని వారు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నట్లయితే తమకు రిపోర్టు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు.
ఈ నెల 15వ తేదీలోగా పంట రుణాలు ఇవ్వాలని సూ చించారు. ప్రతీ రోజు ఐదు గంటలకు ఏయే బ్యాంకులు ఎం త మంది రైతులకు రుణాలు ఇచ్చారో తనకు నివేదికల రూపంలో పంపాలని అన్నారు. సంబంధిత మండల తహశీల్దార్లు, ఆర్డీవోలు ఆయా పరిధిలోని బ్యాంకుల్లో కొద్ది సమ యం కేటాయించాలని, బ్యాంకు అధికారుల సమన్వయం తో పంట రుణాల మంజూరులో సహకరించాలని కోరారు. మండలాల ఏవోలు, ఎడీలు, కూడా బ్యాంకులకు వెళ్లి రుణా ల విషయంలో సరి చూడాలని ఆదేశించారు. పరిహారంను రైతు పాత బకాయి కింద జమ చేస్తే ఆ బ్యాంకుల వివరాలను తనకు పంపాలని ఎల్‌డీఎంకు సూచించారు.
ఓ జిల్లా కలెక్టర్ బ్యాంకర్లపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేస్తే బాగుంటుందా.. అని ప్రశ్నించారు. అనంతరం వివిధ బ్యాంకుల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువజన సర్వీసుల శాఖలు వివిధ పథకాల కింద బ్యాంకుల ద్వారా కల్పిస్తున్న రుణ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జన్‌ధన్ యోజన పథకం కింద ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలని, ఇందుకు జీరో ఖాతా తెరవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, ఎల్‌డీఎం శర్మ, జేడీఏ రోజ్‌లీల, ఆర్డీవోలు, వివిధ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
పంట రుణాలివ్వడంలో వెనుకంజ
Published Sat, Oct 11 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement
Advertisement