4న న్యాయవాదుల చలో సెక్రటేరియట్ | lawyers Challo Secretariat march 4th | Sakshi
Sakshi News home page

4న న్యాయవాదుల చలో సెక్రటేరియట్

Published Sun, Mar 1 2015 2:47 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM

lawyers Challo Secretariat march 4th

సాక్షి, హైదరాబాద్: హైకోర్టును వెంటనే విభజించాలని, అప్పటి వరకు జేసీజే నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి తెలిపారు.  శనివారం సిటీ సివిల్ కోర్టు ఆవరణలో హైకోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు ఎం.సహోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నేతలతోపాటు అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వరకు తెలంగాణ వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించనున్నట్టు తెలిపారు. కాగా, హైకోర్టు విభజనతోపాటు ఉద్యోగుల సంక్షేమం కోసం శెట్టి కమిషన్ చేసిన సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని కోరుతూ న్యాయశాఖ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం హైకోర్టుకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి శనివారం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement