దత్తత గ్రామాల్లో నేతల పర్యటన | leaders visted their adopted village in nizamabad district | Sakshi
Sakshi News home page

దత్తత గ్రామాల్లో నేతల పర్యటన

Published Tue, Aug 18 2015 1:39 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

leaders visted their adopted village in nizamabad district

డిచ్‌పల్లి(నిజామాబాద్): గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు వారు దత్తత తీసుకున్న గ్రామాల్లో పర్యటించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాలను దత్తతు తీసుకున్న ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ రోజు ఆయా గ్రామాల్లో పర్యటించి గ్రామజ్యోతి కార్యక్రమ అమలు తీరును పరిశీలించారు. మండలంలోని ఇందాల వాయి గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సందర్శించి పనులు పరిశీలించారు.

గ్రామంలో రోడ్లను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను ఆయన జేసీబీ సహాయంతో కూల్చివేశారు. తర్వాత పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ దత్తత గ్రామం రాంపూర్‌లో జరిగిన గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ జిల్లా చంద్రశేఖర్ రెడ్డి, మండలంలోని బరిదాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో అక్కడి పనులను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement