దేవరకద్ర : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చిరుత సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండలంలోని గద్దెగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి చిరుత ప్రవేశించి ఆవు దూడను చంపేసింది. శనివారం ఉదయం ఆనవాళ్లను గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమీపంలోని గుట్టల ప్రాంతం నుంచి చిరుత వచ్చి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. తరచూ చిరుతల సంచరించడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.