ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాబ్రి గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాబ్రి గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బద్దం జంగారెడ్డి (37)కి నాలుగు ఎకరాల పొలం ఉంది. దీంతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో పంట చేతికి రాదేమోననే వేదనతో ఆదివారం పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.