లావాదేవీలకే లోకేశ్, కేటీఆర్ విదేశీ పర్యటన | Lokesh ,ktr transactions, foreign tour | Sakshi
Sakshi News home page

లావాదేవీలకే లోకేశ్, కేటీఆర్ విదేశీ పర్యటన

Published Sat, May 9 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

లావాదేవీలకే లోకేశ్, కేటీఆర్ విదేశీ పర్యటన

లావాదేవీలకే లోకేశ్, కేటీఆర్ విదేశీ పర్యటన

తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కో చైర్‌పర్సన్ విమలక్క
 
హన్మకొండ: వ్యాపార లావాదేవీలు మాట్లాడుకునేందుకే ఇరు రాష్ట్రాల సీఎంల కుమారులు లోకేశ్, కేటీఆర్‌లు విదేశీ పర్యటనకు వెళ్లారని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కో చైర్‌పర్సన్ విమలక్క ఆరోపించారు. హన్మకొండలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బయట ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారని, లోలోపల ఇద్దరు ఒక్కటేనన్నారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు పౌరసమాజం ముందుకు రావాలని కోరారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో అధికంగా రైతు ఆత్మహత్యలు జరిగితే...వెలుగులోకి రాకుండా అధికారులు తొక్కి పెట్టారన్నారు.      
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement