
నిలిచిపోయిన లారీలు
నల్లగొండ: డిమాండ్లను పరిష్కరించాలంటూ మంగళవారం అర్థరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లారీలు సమ్మె జరుగుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో లారీలు రోడ్లకు ఇరువైపుల నిలిచిపోయి దర్శనమిస్తున్నాయి. నల్లొండ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం లారీ యజమానులు అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు