రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో శనివారం అర్థరాత్రి కురిసిన అకాల వర్షంతో చేతికి వచ్చిన పంటలు తడిచి, రైతుకు నష్టం కలిగించాయి. తాండూరు మార్కెట్‌యార్డులో శనివారం అర్థరాత్రి దాటిన తరువాత సుమారు గంటపాటు వర్షం కురియటంతో మార్కెట్ యార్డులో నిల్వ చేసిన వేరుశనగలు, కందుల బస్తాలు తడిసిపోయాయి. అలాగే, యాలాల మండలంలో సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పెద్దేముల్ మండలంలో అదివారం తెల్లవారు జామున ఓ మోస్తరు వర్షం పడింది. దీంతో చెరకు పంటకు ఎంతో మేలు జరిగింది.
(తాండూరు)
అకాల వర్షం..కొంత లాభం..కొంత నష్టం
Published Sun, Mar 1 2015 7:11 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement