groundnuts
-
చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
వేరుశనగపప్పులు బూజు పట్టి, చర్మం ముడుచుకుని పోయి ఉన్నాయంటే అవి తెగుళ్ల కారణంగా విషపూరితమయ్యాయని అర్థం. ఫంగస్ సోకిన, ముడుచుకుని పోయిన వేరుశనగ పప్పులను తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషాల బారిన పడకుండా దేహాన్ని సంరక్షించే ప్రక్రియలో మొదటగా దెబ్బతినేది కాలేయం, వ్యాధినిరోధక వ్యవస్థ.బూజు పట్టిన పప్పులు లివర్ డ్యామేజ్‌కి కారణమవుతాయి. కాలేయం వాపు, మచ్చలతోపాటు పనితీరు లోపించడం, లివర్ క్యాన్సర్ వంటి అనారోగ్యాలు సంభవిస్తాయి. వీటితోపాటు తక్షణం బయటపడే అనేక ఇతర అనారోగ్యాలు, అలర్జీలు, కడుపు నొప్పి, డయేరియా, తల తిరగడం, వాంతులవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యల్లో బ్రాంకైటిస్, ఆస్త్మాతోపాటు ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, పెద్ద పేగు క్యాన్సర్లకు దారితీస్తుంది. సంవత్సరాలపాటు ఆహారంలో ఇవి కొనసాగినట్లయితే నర్వస్ సిస్టమ్ కూడా బలహీనపడుతుంది. తరచూ తలనొప్పి, దేహంలో ప్రకంపనలు, జ్ఞాపకశక్తి లోపించడం జరుగుతుంది. మనం ఊహించని మరో సమస్య పునరుత్పత్తి వ్యవస్థ అపసవ్యతలకు లోనుకావడం కూడా.అందుకే వేరుశనగపప్పులనాణ్యతను పరిశీలించుకున్న తర్వాత మాత్రమే వంటల్లో వాడాలి. పప్పులను కొన్న వెంటనే పేపర్ మీద పోసి బూజుపట్టిన, ముడుచుకు పోయిన పప్పులను తొలగించి మంచి పప్పులను డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. పప్పులు సేకరించి నూనె పట్టించుకునే వాళ్లు కూడా బూజు పట్టిన పప్పులను, డొల్లగా ఉన్న పప్పులను జాగ్రత్తగా ఏరి పారేసి మంచి పప్పులతో నూనె పట్టించుకోవాలి.– సుజాత స్టీఫెన్ ఆర్.డి, న్యూట్రిషనిస్ట్ఇవి చదవండి: వంధ్యత్వం కాదు.. అంధత్వం! -
పల్లీల్లో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ..
-
వేరుశెనక్కాయల్లో డబ్బులే డబ్బులు
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, విలువైజ వజ్రాలను అక్రమంగా తరలించేందుకు దళారులు వివిధ మార్గాలు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అక్రమంగా తీసుకు వచ్చిన తీరు చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. అయ్యగారి పనితనం చూసి ‘వాట్ యాన్ ఐడియా’ అంటూ అవాక్క అయ్యారు. ఆ వ్యక్తి వినూత్న రీతిలో విదేశీ కరెన్సీని తీసుకువచ్చినా ...చివరికి అధికారులకు చిక్కిన సంఘటన ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బందికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్ పాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి. అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు. వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్ పాకెట్లో ప్రతి బిస్కెట్ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్ చేసినట్లు ఆధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. అయితే మురాద్ సాధారణ కూలీ అని, అతడి చేత ఎవరో ఈ పని చేయించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు ట్విటర్లో పోస్ట్ చేశారు. మురాద్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ఇలా ఉండిపోవాల్సిందేనా!
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఏర్పాటు చేసిన ఆరు వేరుశనగ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో 75,120.8 క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు చేశారు. సరుకును నిల్వ చేయడానికి గోదాములు లేకపోవడంతో ఇందుల్లో 45 వేల క్వింటాళ్లకు పైనే కొనుగోలు కేంద్రాల్లో ఉండిపోయింది. మరోవైపు వేరుశనగ కొనుగోలుకు ఖాళీ సంచుల కొరత వేధిస్తోంది. గోదాములు, సంచులు లేకపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. శనివారం నుంచి ఏ కేంద్రంలోనూ కొనుగోళ్లు జరగలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకముందే గోదాములను సిద్ధం చేయాల్సిన ఆయిల్‌పెడ్, నాఫెడ్ హడావుడిగా కొనుగోళ్లు ప్రారింభించడం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా చోట్ల వీరి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. ఆదోనిలో తీసుకున్న గోదాములు సరిపోకపోవడంతో రైతులు అమ్మిన సరుకుకు కాపలా ఉంటున్నారు. కొన్నదానిలో 60శాతం పైగా సెంటర్లలోనే నిలిచిపోయిందంటే అధికారుల నిర్లక్ష్యాన్ని చాటుతోంది. డోన్, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, ప్యాపిలిలో వేరుశనగ బస్తాలు గుట్టలు, గుట్టలుగా పేరుకపోయాయి. కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పేరుకపోయిన నిల్వలను ఎప్పటికి తరలిస్తారు... ఎప్పటి నుంచి కొనుగోలు పునః ప్రారంభిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయలేదని, తగ్గించామని ఆయిల్‌ఫెడ్ జిల్లా ఇన్చార్జ్ అంకిరెడ్డి తెలిపారు. సరుకును తరలించే పనులు ఊపందుకున్నాయని, త్వరలోనే పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పారు. -
తెలివితేటలనూ, జ్ఞాపకశక్తిని పెంచే వేరుశెనగ...!
వేరుశనక్కాయలు టైమ్‌పాస్ కోసం అని చాలామంది అనుకుంటారు. అలా వాటిని తినేవారు తాము టైంపాస్ చేస్తున్నామనే భ్రాంతిలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇవ్వడం అనే తమ పనిని తాము సైలెంట్‌గా చేసేస్తాయి వేరుశనక్కాయలు. వాటితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... వేరుశనక్కాయలను ‘బ్రెయిన్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు. వేరుశనగలో ఉండే విటమిన్–బి3 పోషకమే ఇందుకు కారణం. ఈ పోషకం మెదడు చురుకుదనాన్ని పెంచడమే కాకుండా... జ్ఞాపకశక్తి మెరుగయ్యేలా చేస్తుంది. మన మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రసాయం వల్ల మన మూడ్స్ బాగుంటాయి. వేరుశనక్కాయలు తిన్నప్పుడు అందులోని ట్రిప్టోఫాన్ అనే అమైనోయాసిడ్ మెదడులోని సెరటోనిన్ వెలువడటానికి తోడ్పడుతుంది. దాంతో మూడ్స్ బాగుపడటంతో పాటు డిప్రెషన్ కూడా తగ్గుతుంది. అందుకే నిరాశలో, నిస్పృహలో ఉన్నవారు టైంపాస్ కోసం వేరుశనక్కాయలు తింటే మూడ్స్ బాగుపడి డిప్రెషన్ దూరమవుతుంది. వేరుశనక్కాయల్లో – విటమిన్ బి–కాంప్లెక్స్‌లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్ చాలా ఎక్కువ. అవి గర్భవతులకు మేలుచేస్తాయి. ఇక విటమిన్–బి3గా పిలిచే నియాసిన్ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది. -
30 లారీలు వెనక్కి!
యథేచ్ఛగా నాసిరకం చెనక్కాయల సరఫరా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు అనంతపురం అగ్రికల్చర్ : ఎంతమంది ఎన్ని రకాలుగా ఆదేశాలు జారీ చేసినా.. అనంతపురం జిల్లాకు మాత్రం నాసిరకం చెనక్కాయలు సరఫరా అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే 30 లారీల నాసిరకం కాయలను వెనక్కిపంపారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లే ఈ తంతు యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలున్నాయి. ఈ ఖరీఫ్‌లో పంపిణీ చేయడానికి జిల్లాకు 3.90 లక్షల క్వింటాళ్లు కేటాయించారు. ఇందులో కే-6 రకం 3.10 లక్షల క్వింటాళ్లు, కే-9, ధరణి రకాలు 40 వేల క్వింటాళ్ల చొప్పున ఉన్నాయి. సేకరణ, నిల్వ బాధ్యతలను ఏపీసీడ్స్, మార్క్‌ఫెడ్ సంస్థలకు అప్పగించారు. ఏజెన్సీలు మన జిల్లాతో పాటు కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి విత్తనకాయలను మండల కేంద్రాలకు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే 1.60 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉంచాయి. ఈనెల మూడో వారం నుంచి ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ పద్ధతిలో పంపిణీ మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. ఇంకా ధరలు, రాయితీలు ఖరారు కావాల్సివుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా... ఈ సారి నాసిరకానికి తావులేదని మంత్రులు మొదలుకుని కలెక్టర్, జేడీఏ తదితరులు పలుమార్లు ప్రకటనలు గుప్పించారు. అయినా దందా ఆగడం లేదు. చెనక్కాయలు బాగోలేవని 20 మండలాల నుంచి 30 లారీల వరకు వెనక్కిపంపించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతుండటమే ఇందుకు నిదర్శనం. దీనికి సంబంధించి కచ్చితమైన వివరాలు ఇవ్వడానికి అధికారులు వెనకాడుతున్నారు. నిబంధనల మేరకు మొలకశాతం (జర్మినేషన్) 70 శాతం, ఫిజికల్ ప్యూరిటీ 96 శాతం, వ్యర్థాలు 4 శాతం, తేమశాతం 9 వరకు ఉండాలి. కానీ... ఎక్కడా ఈ నిబంధనలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. నాసిరకాన్ని అరికట్టేందుకు ఈ సారి జిల్లాలోని విత్తనకాయల శుద్ధి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 10 మంది వ్యవసాయాధికారులను నియమించినా, ఫలితం లేదు. గతంలో నాసిరకం విత్తనకాయలు సరఫరా చేసినా వారిపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ తంతు నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు పీవీ శ్రీరామమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. ‘నాణ్యతలో రాజీపడవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఇక నుంచి తిప్పి పంపకుండా సీజ్ చేసి కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నా’మని చెప్పారు. -
ఇక్రిశాట్ శాస్త్రవేత్త రాజీవ్ వార్ష్నీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వేరుశనగ దిగుబడులు రెట్టింపు చేయగల కొత్త వంగడాలు మరో ఐదేళ్లలో రైతులకు అందుబాటులోకి రానున్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మెట్టప్రాం త పంటల పరిశోధన కేంద్రం(ఇక్రిశాట్) శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ వార్ష్నీ తెలిపారు. ది ఇంట ర్నేషనల్ పీనట్ జినోమ్ ఇనిషియేటివ్(ఐపీజీఐ)లో భాగంగా వేరుశనగ మొక్క జన్యుక్రమ నమోదును పూర్తి చేయడం దీనికి కారణమని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఫలి తంగా పంట దిగుబడులను ఎక్కువ చేయగలగడంతోపాటు కరవును సైతం తట్టుకునే, గిం జల్లోని నూనె మోతాదును పెంచగల కొత్త వం గడాలను అభివృద్ధి చేయవచ్చునని వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసేందుకు పది పన్నెండేళ్లు పడుతుందని, జన్యుక్రమం అందుబాటులో ఉండటం వల్ల ఈ సమయం సగానికి తగ్గుతుందని ఆయన తెలిపారు. కరవును తట్టుకోగల కొన్ని వంగడాలను తామిప్పటికే సంప్రదాయ పద్ధతుల్లో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రైతులకు అందించామని అన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ దిగుబడులు హెక్టారుకు ఒక టన్నుకు మించడం లేదని... జన్యుక్రమాన్ని పరిశీలిస్తే 4 - 5 టన్నుల దిగుబడులూ సాధించగల సామర్థ్యం ఉందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో దిగుబడులు కనీసం రెండు టన్నులకు పెంచగల వంగడాలను అభివృద్ధి చేయగలమని తాము గట్టి నమ్మకంతో ఉన్నామని చెప్పారు. పైగా ఈ కొత్త వంగడాలు జన్యుమార్పిడి పంటలు కావు కాబట్టి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వీటిని నేరుగా వాడుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. బొలీవియా మొక్క నుంచి... ప్రస్తుతం ఉపయోగిస్తున్న వేరుశనగ దక్షిణ అమెరికాలోని బొలీవియా నుంచి ప్రపంచమంతా విస్తరించినట్లు ఐపీజీఐ పరిశీలన ద్వారా స్పష్టమైంది. రెండు వేర్వేరు జాతుల మొక్కల సంకరం ద్వారా పుట్టిన వేరుశనగలో రెండు జన్యుక్రమాలు ఉన్నాయని డాక్టర్ రాజీవ్ వార్ష్నీ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ జన్యుక్రమంలో వచ్చిన మార్పులు కూడా తక్కువేనని పూర్వజాతులతో పోలిస్తే 99.96 శాతం జన్యుక్రమం ఇప్పటికీ కొనసాగుతోందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డేవిడ్ బెర్టియోలీ అంటున్నారు. ఐజీపీఐలో ఇక్రిశాట్‌తోపాటు ఆరు దేశాలకు చెందిన 39 మంది శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. -
ఎకరానికి 85 బస్తాల వేరుశనగ!
రూ.50 వేల నికరాదాయం పొందిన యువ రైతు ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) రూపొందించి విడుదల చేసిన వేరుశనగ వంగడం వేసవి పంటగా అధిక దిగుబడినివ్వడం విశేషం. ఈ వంగడం పేరు టీఎల్జి-45. కడప జిల్లా చెన్నూరు మండలం బాలసింగాయపల్లికి చెందిన రైతు వెంకటేశ్వర్‌రెడ్డి(92474 36849) ‘బార్క్’ శాస్త్రవేత్తల నుంచి ఈ వంగడాన్ని తీసుకొచ్చి కొన్నేళ్ల నుంచి సాగు చేస్తున్నారు. ఆయన వద్ద నుంచి కడప నగర పరిధిలోని చలమారెడ్డిపల్లెకు చెందిన యువరైతు శిరిగిరెడ్డి పురుషోత్తమరెడ్డి గత ఏడాది ఈ విత్తన కాయలు కొన్నారు. ఆ విత్తన కాయల్లో నుంచి మేలైన కాయలను ఏరి.. గత ఏడాది విత్తనోత్పత్తి చేశారు. ఆ విత్తనంతో ఈ ఏడాది మార్చిలో తన ఎకరం 30 సెంట్లలో సాగు చేశారు. ఎకరంలో ఇటీవల నూర్పిడి చేయగా.. 85 బస్తాల పచ్చి కాయల(బస్తా 40 కిలోలు) దిగుబడి వచ్చిందని పురుషోత్తమరెడ్డి తెలిపారు. మిగతా 30 సెంట్లలో పంటను విత్తనాల కోసం ఉంచానన్నారు. తమ ప్రాంతంలో 65-70 బస్తాల వరకు పచ్చి కాయల దిగుబడి వస్తుంటుందని, అయితే, మేలైన విత్తన కాయలు వాడటం, శ్రద్ధగా సాగు చేయడం వల్ల తనకు అధిక దిగుబడి వచ్చిందని పురుషోత్తమరెడ్డి తెలిపారు. వేరు పురుగు, అడవి పందుల బెడద లేకపోతే మరో 5-10 బస్తాల పచ్చి కాయలు అదనంగా దిగుబడి వచ్చేదన్నారు. మార్చి 28న విత్తనం వేశానని, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తగా నీటి తడులు ఇస్తూ కంటికి రెప్పలా పంటను కాపాడి అధిక దిగుబడి సాధించానని పురుషోత్తమరెడ్డి (77948 85686) సంతోషంగా చెప్పారు. పుష్కలంగా పశువుల ఎరువు, ఆముదం పిండి, జీవన ఎరువులతోపాటు తగుమాత్రంగా రసాయనిక ఎరువులు వాడి, శ్రద్ధగా సస్యరక్షణ చర్యలు చేపట్టానని తెలిపారు. ఒకసాలు అదనంగా లోతు దుక్కి చేయడం కూడా కలసివచ్చిందన్నారు. ఈ రకం కాయలు, విత్తనాలు పెద్దగా ఉంటాయి. నూనె దిగుబడి శాతం ఇతర వంగడాల మాదిరిగానే ఉంటుంది. మూడు, నాలుగు విత్తనాల కాయలు కూడా అధికంగా ఉంటాయి. ఉడకబెట్టి తినడానికి, చెట్నీలకు ఈ వంగడం అనుకూలంగా ఉంటుంది. దీంతో పురుషోత్తమరెడ్డి వద్ద నుంచి వ్యాపారులు పచ్చి కాయల బస్తాను రూ.1,160 వరకు ధర చెల్లించి కొన్నారు. ఎకరానికి రూ. 47 వేల వరకు ఖర్చయ్యింది. ఖర్చులు పోను రూ. 50 వేలకు పైగా నికరాదాయం వచ్చింది. టీఎల్జి-45 వంగడం ఈ స్థాయిలో దిగుబడినివ్వడం స్థానిక వ్యవసాయాధికారులతో పాటు ‘బార్క్’ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచింది. వేసవి పంటగా సాగు చేసి ఇంత దిగుబడి తీయడం మరో విశేషం. - ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్ -
అకాల వర్షం..కొంత లాభం..కొంత నష్టం
రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో శనివారం అర్థరాత్రి కురిసిన అకాల వర్షంతో చేతికి వచ్చిన పంటలు తడిచి, రైతుకు నష్టం కలిగించాయి. తాండూరు మార్కెట్‌యార్డులో శనివారం అర్థరాత్రి దాటిన తరువాత సుమారు గంటపాటు వర్షం కురియటంతో మార్కెట్ యార్డులో నిల్వ చేసిన వేరుశనగలు, కందుల బస్తాలు తడిసిపోయాయి. అలాగే, యాలాల మండలంలో సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పెద్దేముల్ మండలంలో అదివారం తెల్లవారు జామున ఓ మోస్తరు వర్షం పడింది. దీంతో చెరకు పంటకు ఎంతో మేలు జరిగింది. (తాండూరు)