కాటేదాన్: నిబంధనలకు విరుద్ధంగా జంతువుల ఎముకలు, కళేబరాలతో నూనెను తయారు చేస్తున్న పరిశ్రమపై బుధవారం సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడిచేశారు. పరిశ్రమలో నిల్వ ఉంచిన 9 డ్రమ్ముల నూనెతో పాటు డాల్డాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ ఉస్మాన్(45) అలీనగర్‌లో జంతుకళేబరాలతో నూనెను తయారుచేసే పరిశ్రమను నెలకొల్పాడు. వెయ్యి గజాల స్థలంలో ఏర్పాటుచేసిన ఈ పరిశ్రమలో మొత్తం 8 బట్టీల్లో జంతు కళేబరాలు, ఎముకలను ఉడికించి నూనె తయారు చేస్తున్నాడు.
ఈ నూనెను నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం ఎస్‌ఓటీ పోలీసులు ఈ పరిశ్రమపై దాడిచేసి సీజ్ చేశారు. అయితే, ఉస్మాన్ మళ్లీ పరిశ్రమను తెరిచి తన దందా నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలిసి ఎస్‌ఓటీ ఓఎస్‌డీ రాంచందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు ఉపేందర్, పుష్పక్‌కుమార్ తమ సిబ్బందితో కలిసి బుధవారం ఆ పరిశ్రమపై దాడి చేశారు. సూపర్‌వైజర్ జావిద్‌తో పాటు మరో 12 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.
జంతుకళేబరాలు, ఎముకలను తీసుకొచ్చేందుకు వినియోగించే డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశ్రమను సీజ్ చేశారు. మరోమారు ఈ పరిశ్రమ కొనసాగకుండా జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరిశ్రమలో ఏర్పాటుచేసిన బట్టీలన్నింటినీ కూల్చివేస్తామని ఎస్‌ఓటీ పోలీసులు స్పష్టం చేశారు. కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.
ఎముకలతో నూనె
Published Thu, Oct 2 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
Advertisement
Advertisement