Animal bones
-
Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు
సాక్షి, మహబూబ్‌నగర్(అచ్చంపేట రూరల్): ఎలాంటి అనుమతి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా గుట్టలో నిర్వహిస్తున్న జంతు ఎముకలతో తయారుచేసే పౌడర్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఈ విషయమై సోమవారం అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో పులిజాల గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ పాండునాయక్ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి తహసీల్దార్ కృష్ణయ్య, ఎస్ఐ ప్రదీప్‌కుమార్, ట్రాన్స్‌కో ఏఈ మేఘనాథ్, సిబ్బందితో కలిసి చేరుకున్నారు. అక్కడి మూడు షెడ్లలో జంతువుల ఎముకలను చూర్ణం చేసే యంత్రాలు, కుప్పలుగా ఉన్న వాటి వ్యర్థాలను పరిశీలించారు. చదవండి: (సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూమిలో షెడ్డు నిర్మించడం, స్థానికంగా ఏ శాఖ అనుమతి పత్రాలు లేనందున ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అలాగే విద్యుత్ సరఫరా కాకుండా జంపర్లను తీయించారు. కాగా, నిర్వాహకులు మాత్రం ఈ పౌడర్‌ను ఆర్గానిక్ ఎరువులలో ఉపయోగిస్తారని, దీనిని చెట్లకు వాడతారని చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం లేకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలాఉండగా గతంలోనూ అచ్చంపేట మండలంలోని చౌటపల్లి, సిద్దాపూర్ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా జంతు కళేబరాలతో తయారుచేసే నూనె ఫ్యాక్టరీలను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (కన్నబిడ్డల్ని హత్యచేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య) -
కల్తీ నూనె స్థావరంపై దాడులు
నిజామాబాద్: జంతు కళేబరాలు, కొవ్వు నుంచి నూనె తయారుచేస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామ సమీపంలో జంతు వ్యర్థాల నుంచి నూనె తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేశారు. 50 నూనె డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడులను గమనించిన నిర్వాహకులు పరారు కాగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
జోరుగా బోన్ ఆయిల్ విక్రయాలు
పలమనేరు: జిల్లాలో బోన్ ఆయిల్ పేరిట జంతువుల ఎముకలతో తయారు చేసిన నూనె విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. సాధారణ వంట నూనెల్లోనూ ఈ ఆయిల్‌ను కలిపి తక్కువ ధరకే కొందరు అమ్ముతున్నారు. లోకల్ డాల్డా పేరిట చిన్నచిన్న హోటళ్లకు ఈ నూనెను రిటైల్‌గా విక్రయిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎముకల సేకరణ కేంద్రాలు భారీగా ఉన్నాయి. కొందరు ఏజెంట్లు ఈ ఎముకలను సరిహద్దులోని తమిళనాడుకు తరలించి అక్కడి నుంచి బోన్‌ఆయిల్‌ను ఇక్కడికి చేరవేస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన ఆహారకల్తీ నియంత్రణ శాఖ అసలు పట్టించుకోవడం లేదు. బోన్ ఆయిల్‌తో తయారుచేసిన పదార్థాలు తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే. పలుచోట్ల ఎముకల సేకరణ కేంద్రాలు జంతువుల ఎముకలను సేకరించి ఎండబెట్టి కొందరు తమిళనాడులోని ఫ్యాక్టరీలకు విక్రయిస్తున్నారు. పలమనేరు పట్టణ సమీపంలోని గడ్డూరు ఇందిరమ్మ కాలనీ వద్ద ఓ ఇంట్లో ప్రస్తుతం ఎముకల సేకరణ భారీగా సాగుతోంది. ఈ ఇంటి ఆవరణలో ఎటువైపు చూసినా జంతువుల క బేళాలు, ఎండబెట్టిన ఎముకలు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. ఇలాంటి ఎముకల సేకరణ కేంద్రాలు వి.కోట, చిత్తూరు, పుత్తూరు, మదనపల్లె, పుంగనూరు తదితర ప్రాంతాల్లో రహస్యంగా సాగుతోంది. ఇలా సేకరించిన ఎముకలను అక్రమంగా తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం, పేర్నంబట్, ఆంబూర్ తదితర ప్రాం తాలకు తరలిస్తున్నారు. వీటితో అక్కడ ఈ బోన్‌ఆయిల్‌ను తయారు చేస్తున్నారు. వంట నూనెల్లో బోన్ ఆయిల్ కల్తీ బోన్ ఆయిల్‌ను ఐదు లీటర్లు, పది లీటర్ల క్యాన్ల లో నింపి అమ్ముతున్నారు. వంట నూనెల్లోనూ కల్తీ చేసి రకరకాల కంపెనీ ప్యాకెట్లుగా తయారుచేస్తున్నారు. మరోవైపు లూజ్ డాల్డా పేరిట ఎముకల నూనెను కలిపి పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి ఎముకలు తీసుకెళ్లే ఏజెంట్లే వచ్చేటపుడు అక్కడి నుంచి ఈ బోన్ ఆయిల్‌ను ఇక్కడికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నూనె భలే చీప్.. స్థానికంగా వేరుశెనగ నూనె లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ కంపెనీ బ్రాండ్‌ను బట్టి లీటర్ రూ.80 నుంచి 100 దాకా దొరుకుతోంది. డాల్డా, పామోలిన్ రూ.60 వరకు అమ్ముతున్నారు. ఈ బోన్ ఆయిల్ కల్తీచేసిన నూనె లీటర్ రూ.30కే దొరుకుతోంది. దీంతోపాటు డాల్డా, పామోలిన్ రూ.20 లకే అమ్ముతున్నారు. తక్కువ ధరకే దొరుకుతోం దన్న ఆశతో పలువురు వీటిని కొనుగోలుచేసి ఉపయోగిస్తున్నారు. లోకల్ డాల్డా పేరిట హోటళ్లకు విక్రయాలు తమిళనాడుకు చెందిన కొందరు ఏజెంట్లు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిన్నహోటళ్లకు బోన్‌ఆయిల్‌ను సరఫరా చేస్తున్నారు. లోకల్డాల్డా పేరిట బహిరంగంగానే విక్రయిస్తున్నారు. దానికి తోడు ముందుగా సరుకిచ్చి వారం తర్వాత డబ్బులు తీసుకెళ్తున్నారు. దీంతో హోటల్ వ్యాపారులు సైతం ఈ నూనె కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే బోన్ఆయిల్ లేదా కల్తీ చేసిన నూనెలతో తయారుచేసే ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు. ఒంటిపై దద్దుర్లు రావడం, ఆపై చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతోందని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇలాంటి నూనెలతో జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని, ముఖ్యంగా మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా ప్రమాదకరమని ైవె ద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఒబెసిటి లాంటి వ్యాధులు కూడా రావచ్చని చెబుతున్నారు. పట్టించుకోని ఫుడ్ సెఫ్టీ విభాగం ఆహార పదార్థాల కల్తీని గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సెఫ్టీ అధికారులు కల్తీ నూ నెల వ్యవహారాన్ని అసలు పట్టించుకోవడం లే దు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టణాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. మున్సిపాలిటీల్లోని అధికారులు ఈ కల్తీ గురించి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్లకు సోదాలు చేసే అధికారం లేకపోవడమూ ఓ కారణంగా మారింది. ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌ను అమలు చేస్తున్నా ఇలాంటి అక్రమాలు మాత్రం తగ్గడం లేదు. దీనిపై ఆహా ర కల్తీ నిరోధక శాఖ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ అయినా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై చిత్తూరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డిని వివరణ కోరగా తమకు ఇంతవరకు ఈ విషయం తెలీదని, వెంట నే జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని అన్నారు. -
ఆ నూనె.. ప్రాణాంతకం!
రంగు.. రుచి.. చిక్కదనం..! ఈ స్లోగన్ ఓ టీ పొడి కంపెనీదని అందరికీ తెలుసు. అంటే టీ పొడిలో ఆ మూడు గుణాలు ఉంటాయని వినియోగదారులకు సదరు కంపెనీ యాజమాన్యం చెబుతుంతోంది. వీరి వ్యాపారానికి పభుత్వ అనుమతి ఉండే ఉంటుంది. కల్తీ నూనె విషయంలో అక్రమార్కులు కొందరు అదే తరహాలో ప్రచారం చే స్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. వీరి వ్యాపారం అక్రమం. ఫలితంగా సామాన్యులు అనారోగ్యం పాలవుతున్నారు. * జంతు కళేబరాలతో తయారవుతున్న ఆయిల్ * ఆటోల్లో అర్ధరాత్రి తరలింపు * తక్కువ రేటుకు హోటళ్లకు సరఫరా * అనారోగ్యం పాలవుతున్న ప్రజలు ఉలవపాడు : జిల్లాలో కల్తీ నూనె వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది. అర్ధరాత్రి ఆటోల్లో కొన్ని దుకాణాలకు రహస్యంగా తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ నూనె పీపాలను ఉలవపాడు నుంచి సింగరాయకొండ, కందుకూరులోని పలు షాపులకు తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. జంతు కళేబరాలతో నూనెను తయారు చేసి.. నల్లరంగు వేసి ఉన్న డబ్బాల్లో అచ్చం నూనెను పోలి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయట ప్రాంతంలో తయారవుతున్న కల్తీ నూనెను రాత్రి వేళల్లో మాత్రమే షాపులకు తరలిస్తున్నారు. ప్రతి రెండు రోజులకు సుమారు 7 నుంచి 10 పీపాలు ఒక్క ఉలవపాడుకు సరఫరా చేస్తున్నారంటే అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో పీపాలో 220 లీటర్ల నూనె ను నింపుతారు. వ్యాపారులు చిన్న డబ్బాల్లోకి మార్చి ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. కల్తీ నూనెను పామాయిల్ రేటుకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు కూడా ఆ నూనెను వాడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ వినియోగించే హోటళ్లకు చాలా తక్కువ ధరకే అమ్ముతుండటంతో వ్యాపారులు కూడా పోటీ పడి మరీ కొట్టున్నట్లు సమాచారం. ఇట్టే.. గుర్తు పట్టొచ్చు ఇటీవల ఓ పండుగకు ఉలవపాడు హైస్కూల్ సంఘానికి చెందిన రైల్వే ఉద్యోగికి ఓ దుకాణం యజమాని కల్తీ నూనె అమ్మాడు. ఇంటికి తీసుకెళ్లి కూర వండిన తర్వాత దుర్వాసన రావడంతో సదరు ఉద్యోగికి అనుమానం వచ్చింది. నూనె కల్తీ జరిగిందని గ్రహించి దుకాణ యజమానిని నిలదీశాడు. సదరు యజమాని హడావుడిగా డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. గుర్తు పట్టలేని ఎందరో ప్రజలు క ల్తీ నూనె భారిన పడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కొందరు అప్రమత్తమై హోటళ్లకు వెళ్లడం మానేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కల్తీ నూనెలో ఎముకల పొడి, కుళ్లిన కళేబరాల అవశేషాలు ఉండటంతో గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు కూడా అవుతాయని చెబుతున్నారు. వ్యాపారుల దందా అధికారులకు తెలిసే ఉంటుందని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్తీ నూనె విక్రయాలపై కన్నెర్రజేయాలని కోరుతున్నారు. కల్తీ నూనె అమ్మారు : కర్రెద్దుల బాబూరావు, ఉలవపాడు ఉలవపాడులో ఓ దుకాణం యజమాని నాకు కల్తీ నూనె అమ్మాడు. ఇంటికి వెళ్లి దాంతో కూర వండితే అంతా చేదుగా మారింది. వెంటనే వెళ్లి ఆ వ్యాపారిని నిలదీశా. గొడవ వద్దు మాట్లాడుకుందాం.. అని బతిమాలాడు. ప్రజలు కల్తీ నూనె విషయంలో అప్రమత్తంగా ఉండాలి. -
ఎముకలతో నూనె
కాటేదాన్: నిబంధనలకు విరుద్ధంగా జంతువుల ఎముకలు, కళేబరాలతో నూనెను తయారు చేస్తున్న పరిశ్రమపై బుధవారం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడిచేశారు. పరిశ్రమలో నిల్వ ఉంచిన 9 డ్రమ్ముల నూనెతో పాటు డాల్డాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ ఉస్మాన్(45) అలీనగర్‌లో జంతుకళేబరాలతో నూనెను తయారుచేసే పరిశ్రమను నెలకొల్పాడు. వెయ్యి గజాల స్థలంలో ఏర్పాటుచేసిన ఈ పరిశ్రమలో మొత్తం 8 బట్టీల్లో జంతు కళేబరాలు, ఎముకలను ఉడికించి నూనె తయారు చేస్తున్నాడు. ఈ నూనెను నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం ఎస్ఓటీ పోలీసులు ఈ పరిశ్రమపై దాడిచేసి సీజ్ చేశారు. అయితే, ఉస్మాన్ మళ్లీ పరిశ్రమను తెరిచి తన దందా నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలిసి ఎస్ఓటీ ఓఎస్డీ రాంచందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు ఉపేందర్, పుష్పక్కుమార్ తమ సిబ్బందితో కలిసి బుధవారం ఆ పరిశ్రమపై దాడి చేశారు. సూపర్వైజర్ జావిద్తో పాటు మరో 12 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. జంతుకళేబరాలు, ఎముకలను తీసుకొచ్చేందుకు వినియోగించే డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశ్రమను సీజ్ చేశారు. మరోమారు ఈ పరిశ్రమ కొనసాగకుండా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశ్రమలో ఏర్పాటుచేసిన బట్టీలన్నింటినీ కూల్చివేస్తామని ఎస్ఓటీ పోలీసులు స్పష్టం చేశారు. కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.