రాజకీయ వాసన కూడా పట్టని కుటుంబం నుంచి వచ్చి, సీటీ బస్పు కిటికీలోంచి అసెంబ్లీని చూసిన వ్యక్తి అదే అసెంబ్లీలో అదికూడా తెలంగాణ తొలి స్పీకర్ అవుతాడని ఊహించి ఉండరు సిరికొండ మధుసూధనాచారి. సమాజమే దేవాలయం పేద మానవుడే దేవుడు అన్న ఎన్‌టీఆర్ నినాదం నచ్చి మొదటిసారి తెలుగుదేశం ద్వారా వెలుగులోకి వచ్చారు. హిందీ, ఉర్దూ భాషల్లో మాట్లాడగల సిరికొండ రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి కేసీఆర్ బాటలోనే పయనించాడు. స్పీకర్ గా మొదట్లో తడబడ్డా చివరకు తొలితెలంగాణ సభాపతిగా రాణించారు.
చిన్నప్పుడు గోలీలు, కర్రాబిల్లా, కబడ్డీ... ఇలా కనబడ్డ ఆటలన్నీ ఆడూతూ, మార్కులు తక్కువ వస్తే నాన్నచేతి కంసాలి గొట్టంతో దెబ్బలు తిని పెరిగిన మనిషి. సొంత ఊరిలో అమ్మనాన్నల విగ్రహాలు స్థాపించి వారిపై గల ప్రేమను తెలిపిన కూమారుడు. అంతే కాకుండా 3 ఎకరాల మేర వారి పేరుతో హరితహారంను ఏర్పాటు. ప్రతి చెట్టుకీ ఒక పేరు. కుటుంబం సభ్యుల మెత్తం 91 మంది ఫ్లెక్సీలు. తరానికి ఒక శిలా ఫలకాలు... ఏడాదికొకసారి కుటుంబంతో హరితహారం సందర్శించే సాధారణ జీవితం గడిపే వ్యక్తి. చుట్టుపక్కల రెండు మూడు గ్రామాల్లో తండ్రికి ఉన్న గ్రామాల్లో మంచి పేరుని చెడగొట్టకుండా ఉండాలని తనవంత కొన్ని ప్రయత్నాలు చేసిన సిరికొండ. 1970 ప్రాంతంలోనే మానాన్న పెద్ద ఆర్థికవేత్తని, అప్పట్లో రోజు వారి ఖర్చు 10 అయితే 12 సంపాదించే వరకు అన్నం తినడని గొప్పగా చెప్పుకునేవారని, 1980 కాలంలోనే 5 మందిని చదివించాడు అంటే మా నాన్న చాలా గొప్పవారని సిరికొండ తన తండ్రి గురించి చెప్పుకుంటుంటారు.
పేరు : సిరికొండ మధుసూధనాచారి
తల్లిదండ్రులు : వెంకటలక్ష్మీ, వెంకటనర్సయ్య
పుట్టిన తేదీ : సెప్టెంబర్ 26, 1956
ఊరు : వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామం
నేపథ్యం : విశ్వ బ్రాహ్మాణ, కుంటుంబం, 4 అన్నదమ్ముళ్లు, 4 అక్కచెల్లెళ్లు
కుటుంబం : ఇంటర్ మీడియట్ చదివేటప్పుడే బంధువుల అమ్మాయి ఉమాదేవితో పెళ్లి. సంతానం ముగ్గురు అబ్బాయిలు
చదువు : ప్రాథమిక విద్య వరంగల్
♦ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా పొందారు,
♦ఎంఏ కాకతీయ యూనివర్పీటీలో, లా, పర్సనల్ డెవలప్‌మెంట్ కోర్సులు
వృత్తి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలి స్పీకర్
రాజకీయ జీవితం :
► 1982 లో ఎన్‌టీఆర్ పిలుపుతో రాజకీయ ప్రవేశం. తక్కువ సమయంలోనే పార్టీలో కీలకనేతగా ఎదిగారు. 1983లో కొంతకాలం టీడీపీ కార్యదర్శిగా ఉన్నారు.
► 1985 - 89 వరకు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ సభ్యుడు
►1988- 89లో ఫిలిం బోర్డు సెన్సార్ బోర్డు సభ్యుడు
► 1993 లో వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు
► 1994 లో సాయంపేట ఎమ్మెల్యేగా గెలుపు
► 1996 లో అన్నా టీడీపీ పార్టీలో చేరిక
►1999 లో సాయంపేట బరిలో ఓటమి. దీంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు
► 2001లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిక
► 2002 లో పొలిట్ బ్యూరోలో సభ్యుడుగా, భూపాలపల్లి ఉద్యమ కమిటీ ఇన్‌చార్జీగా నియమితులవడం
► 2009 లో మహాకూటమి అభ్యర్థిగా భూపాలపల్లి ఎన్నికల్లో ఓటమి
►2014 భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ బీఫ్ చీఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి పై విజయం సాధించారు.
హాబీ : కవితలు రాయడం ఆసక్తి. 20 ఏళ్ల వయసు నుంచి కవితలు రాయడం మెదలుపెట్టారు. ఎన్‌టీఆర్, కేసీఆర్ పై కవితలు రాశారు.
- దానవీరశూరకర్ణ సినిమా అంటే ఇష్టం
- కొండి దీపిక
Comments
Please login to add a commentAdd a comment