- 'మహా’సీఎం సోదరి ఆందోళన
- నేటి నుంచి తుమ్మిడిహెట్టి ముంపు ప్రాంతాల్లో సర్వే
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్‌లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో కలిగే ముంపుపై ఆ రాష్ట్ర నీటి పారుదల అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు తెలంగాణ లెక్కలను పరిగణలోకి తీసుకుంటూ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర వాదిస్తోంది. వాస్తవ ముంపు అంతకంటే ఎక్కువగా ఉం టుందంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోదరి, ఎమ్మెల్సీ శోభాతాయి ఫడ్నవీస్ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధికారులు వాస్తవాలు తేల్చే పనిలో పడ్డట్టు సమాచారం. ఈ మేరకు గురువారం నుంచి సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం తుమ్మిడిహె ట్టిలో నిర్మించే బ్యారేజీలో ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టు డిజైన్ చేసిన విషయం తెలిసిందే. 150 మీటర్లకు తగ్గించాలంటున్న ‘మహా’ గోదావరి నుంచి 90 రోజుల్లో 160 టీఎంసీలు తీసుకోవాలంటే ప్రతిరోజూ 1.8 టీఎంసీ మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉన్న దృష్ట్యా, బ్యారేజీ ఎత్తు 152 మీటర్లకు దిగువన ఉంటే సాధ్యమయ్యేది కాదని తెలంగాణ మొదటి నుంచి చెబుతోంది. బ్యారేజీతో జరిగే ముంపు సైతం 1850 ఎకరాలను మించదని చెబుతున్నా మహారాష్ట్ర మాత్రం ఎత్తును 150 లేదా 151 మీటర్ల వరకు తగ్గించే అంశాలను మరోసారి పరిశీలించాలని కోరుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ జరిపిన చర్చల్లో కూడా ప్రధానంగా ఎత్తు తగ్గిం చాలనే అంశాన్నే మహారాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తింది. దీంతో ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం దిగువన నీటిని మళ్లించేలా కసరత్తు మొదలుపెట్టారు.
పాత డిజైన్‌తోనే మేలు..!
ప్రాజెక్టుల అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ప్రాణహితకు పాత డిజైనే మేలని, తుమ్మిడిహెట్టి ఎత్తు తగ్గించి నీటిని మళ్లిస్తే నష్టమేమీ లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి వారం కిందట మహారాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి మాలనీ శంకర్‌తో చర్చలు జరిపారు. 15 మీటర్ల ఎత్తుతో జరిగే ముంపుతో పాటే, ఎత్తును 151 లేదా 150 మీటర్ల వరకు తగ్గిస్తే ముంపు ఏ రీతిన తగ్గుతున్న విషయం వివరించారు. అయితే తెలంగాణ చెబుతున్న లెక్కలను మహారాష్ట్ర ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని, ఈ మేరకు కూడా సర్వే చేస్తామని స్పష్టం చేశారు.
ప్రాణహిత ముంపుపై 'మహా’సర్వే!
Published Thu, May 7 2015 2:25 AM | Last Updated on Mon, Oct 8 2018 6:08 PM
Advertisement
Advertisement