చంపి.. తల, మొండెం వేరు చేశారు | man brutally murdered in dhaba | Sakshi
Sakshi News home page

చంపి.. తల, మొండెం వేరు చేశారు

Published Wed, Apr 15 2015 1:58 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

చంపి.. తల, మొండెం వేరు చేశారు - Sakshi

చంపి.. తల, మొండెం వేరు చేశారు

ఇబ్రహీంపట్టణం: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీంపట్టణం మండలంలోని రాజేశ్వరరావుపేటలో మోతే బంగారం(13)అనే బాలుడ్ని గొడ్డలితో నరికి తలను వేరుచేసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. రాజేశ్వరరావుపేట శివారులో ప్రధాన రహదారి పక్కన ఉన్న దాబాలో మెట్‌పల్లి మండలానికి చెందిన బంగారం కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బంగారం మంగళవారం రాత్రి తన తోటి కూలీ దేవదాస్‌తో కలసి డాబాపై నిద్రపోయాడు. తెల్లవారే సరికి బంగారం తలను గొడ్డలితో నరికి దాబాలో మూటకట్టి వెళ్లారు.

దాబా సమీపంలో తల, మొండెం వేరువేరుగా పడి ఉండడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటన స్థలానికి పరిశీలించారు. అయితే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి దేవదాస్ కనిపించటలేదు. దీంతో స్థానికులు, దేవదాస్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement