పెద్దేముల్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల కొండాపూర్ గ్రామంలో తామరాకుల కోసం చెరువులోకి వెళ్లి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. వివరాల ప్రకారం...వినాయక చవితి పండుగ సందర్భంగా వికారాబాద్ ప్రాంతానికి చెందిన లాలప్పతోపాటు పలువురు సోమవారం కొండాపూర్ పెద్ద చెరువులో తామరాకులు తెంపటానికి వెళ్లారు. అయితే చెరువులో దిగిన లాలయ్య సాయంత్రమైనా తిరిగి ఒడ్డుకు చేరుకోలేదు. దీంతో తోటివారు చెరువులో వెతికారు. అయినా ఫలితం లేదు. మంగళవారం లాలప్ప కుటుంబసభ్యులు మరోసారి చెరువులో వెతకగా మృతదేహం దొరికింది.