అప్పుల బాధతో రైతు ఆత్మహత్మ | man suicide due ti heavy debts | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్మ

Published Mon, Feb 23 2015 1:34 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

man suicide due ti heavy debts

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు...గ్రామానికి చెందిన సుభాష్(40)అనే రైతుకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు.

ఖరీఫ్‌లో మొక్కజొన్న, పత్తి సాగు చేశాడు. పంట ఎండిపోవడంతో నష్టం ఎదురైంది. ప్రస్తుతం కూరగాయల సాగు చేస్తున్నాడు. పంట సాగు కోసం దాదాపు ఆరు లక్షల రూపాయల వరకు అప్పు చేసినట్టు సమాచారం. దిగుబడి లేకపోవడంతో అంత అప్పు తీర్చలేనేమోనన్న మనోవేదనతో శుభకార్యక్రమానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పిన సుభాష్ ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
(కొత్తూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement