పంటల కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
బచ్చన్నపేట : పంటల కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి చెందిన రైతు నీల నర్సయ్య(50) తనకున్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. రెండు బోర్లు వట్టిపోయాయి. వరి పంట ఎండిపోయి దిగుబడులు తగ్గిపోయాయి. అప్పులు రూ.4 ల క్షల వరకు పెరిగిపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడే పురుగుల మందుతాగాడు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.