- ముంచిన అకాల వర్షాలు
- నష్టాల్లో రైతులు
చెన్నూర్ : వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట నిరాశాజనకంగా ఉంది. దీనికి తోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచారుు. ప్రకృతి వైపరీత్యాల మూలంగా దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 24 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి తోట లు విస్తరించి ఉన్నారుు. వాతావర ణంలో ఏర్పడ్డ మార్పులకు జనవరిలో రావాల్సిన పూత ఫిబ్రవరి చివర్లో వచ్చిం ది. పూత విరివిగా రావడంతో ఈ ఏడాది దిగుబడి బాగుం టుందని రైతులు సంబురపడ్డారు. కాత దశకు వచ్చే సమయూనికి మబ్బులు రావడంతో పూతంతా నేలరాలింది. వచ్చిన పూత నుంచి కనీసం 5శాతం కూడా నిలువకుండా పోయింది. దీంతో లక్షలాది రూపాయల పెట్టి మామిడి తోటలు కౌలుకు తీసుకున్న రైతులు తలలు పట్టుకుంటున్నారు.
జిల్లా మామిడికి విదేశాల్లో డిమాండ్
జిల్లాలో పండించే దసరి, బంగనపల్లి, చెరుకు రసం, హీమన్ పసంద్, తొతపరి, కొత్తపల్లి కొబ్బర, జంగీర్ లాంటి మామిడి రకాలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఏటా జిల్లా నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీతోపాటు అమెరికా, సిమ్లా, బ్యాకాంగ్ దేశాలకు సుమారు 10 వేల టన్నులకుపైగా మామిడి ఎగుమతి అవుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ జిల్లా మామిడికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది ఆశించిన రితీలో కాత లేక నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వ్యాపారులు నాయిని కిష్టయ్య, జోడు తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలస్యంగా పూత రావడమే..
మామిడి పూత ఆలస్యంగా రావడంతో ఆశించిన మేర కాత నిలువలేక పోయిందని అధికారులు అంటున్నారు. వాతావరణం అనుకూలిస్తే పూత అలస్యంగా వచ్చిన కాత బాగుంటుందని ఉద్యనవన శాఖ అధికారులు తెలిపారు. పిందే దశలో అకాల వర్షాలు రావడంతో పంట దెబ్బతింది. పిందే ఎర్రబారి రాలిపోయింది. దీంతో ఆశించిన దిగుబడి రాకుండా పోరుుంది.
ప్రియం కానున్న పచ్చడి కాయలు
గతేడాదితో పోలిస్తే పచ్చడికాయ ప్రస్తుతం 5 శాతం కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదు. దీంతో పచ్చడి కాయ ధర ప్రియం కానుంది. ధనిక, పేద తేడా లేకుండా సంవత్సరం పాటు నిలువ ఉంచుకునేందుకు మామిడి కాయ పచ్చడి పెట్టుకుంటారు. గతేడు 100 పచ్చడి కాయలకు రూ.200 నుంచి 300 ధర పలికింది. కాత బాగా లేక ఈ ఏడాది 100 కాయకు రూ.500లు పలికే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. దీంతో పేదలకు పచ్చడి మెతుకులు కరువుకానున్నాయి.
ముంచిన అకాల వర్షాలు
ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వ ర్షాలకు మామిడి పంటకు నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన మామిడికాయలు నేల రాలడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. పంట కోసం పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపోయిన మామిడి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.
నిరాశాజనకంగా మామిడి
Published Mon, Apr 20 2015 3:19 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement