సాక్షి, హైదరాబాద్: వీఆర్‌వో పోస్టుల భర్తీ కోసం ఈనెల 16న రాత పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 700 పోస్టులకు 10.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని, అభ్యర్థులు 10:45 గంటల కల్లా పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించింది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాలను మార్పు చేసింది.
ఇవీ మార్పులు..
- సరూర్‌నగర్‌లోని ప్రగతి మహిళా డిగ్రీ కళాశాలలో (సెంటర్ కోడ్ 39124) 1339063388 హాల్‌టికెట్ నంబరు నుంచి 1339063987 నంబరు వరకు 600 మంది అభ్యర్థులకు మొదట పరీక్షకేంద్రం ఏర్పాటు చేయగా తాజాగా దానిని మార్పు చేసింది. వారందరికీ నారాయణ జూనియర్ కాలేజీ (బాయ్స్) ఏఐఈఈఈ క్యాంపస్, బిసైడ్ కమలా హాస్పిటల్ , కర్పూరం ఇందిరా సు శీల కాంప్లెక్స్, దిల్‌సుఖ్‌నగర్‌కు మార్పు చేసింది.
- సాయి చైతన్య జూనియర్ కాలేజీ, ఇంటినంబరు16–11–741/బి/4/ఏ, టీకేఆర్‌ఎస్ ఐకాన్ హాస్పిటల్ లేన్ బిహైండ్ బాప్టిస్ట్ చర్చి, దిల్‌సుఖ్‌నగర్ (సెంటర్ 39133) పరీక్షా కేంద్రాన్ని మార్పు చేసింది. అందులో పరీక్ష రాయాల్సిన 1339068548 హాల్‌టికెట్ నంబరు నుంచి 1339069047 వరకు 500 మందికి మరో కేంద్రాన్ని కేటాయించింది. వారంతా నారాయణ జూనియర్ కాలేజీ ఫర్ గరŠల్స్ 16–11–477/6/ఎ/9/1 బిసైడ్ యూనివర్సిల్ జిమ్ అండ్ బ్రిలియంట్ గ్రామర్‌స్కూల్, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్‌కేంద్రంలో పరీక్ష రాయాలని సూచించింది.
- సరూర్‌నగర్‌లోని న్యూ నోబుల్ డిగ్రీ కాలేజీలో (సెంటర్ కోడ్ 39137) పరీక్షలు రాయాల్సిన 1339070504 నుంచి 1339070953 హాల్‌టికెట్ నంబర్లకు చెందిన 450 మంది అభ్యర్థుల పరీక్షా కేంద్రం మార్పు చేసింది. వారంతా వెలాసిటీ జూనియర్ కాలేజీ, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయాలని సూచించింది.
పలు వీఆర్‌వో పరీక్షా కేంద్రాల్లో మార్పు
Published Sat, Sep 15 2018 2:21 AM | Last Updated on Sat, Sep 15 2018 2:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment