సాక్షి, హైదరాబాద్: వేసవిలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్– దర్భంగా(07007/07008) ప్రత్యేక రైలు ఏప్రిల్ 3, 7, 10, 14, 17, 21, 24, 28, మే 1, 5, 8, 12, 15, 19, 22, 26, 29, జూన్ 2, 5, 9, 12, 16, 19, 23, 26, 30వ తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రెండవ రోజు మధ్యాహ్నం 1.45కి దర్భంగా చేరుకుంటుంది. ఏప్రిల్ 6, 10, 13, 17, 20, 24, 27, మే 1, 4, 8, 11, 15, 18, 22, 25, 29, జూన్ 1, 5, 8, 12, 15, 19, 22, 26, 29, జూలై 3వ తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది కాజీపేట్, రామగుండం మార్గంలో రాకపోకలు సాగిస్తుంది.
హైదరాబాద్–రెక్సాల్ ప్రత్యేక రైలు..
హైదరాబాద్–రెక్సాల్(07005/07006) ప్రత్యేక రైలు ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28వ తేదీల్లో రాత్రి 9.30కి నాంపల్లి నుంచి బయలుదేరి రెండవ రోజు సాయంత్రం 5.30కి రెక్సాల్ చేరుకుంటుంది. ఏప్రిల్ 8, 15, 22, 29 మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24, జూలై 1వ తేదీల్లో తెల్లవారుజామున 1.30కి రెక్సాల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.15కి నాంపల్లి చేరుకుంటుంది. ఇది కాజీపేట్, మంచిర్యాల మార్గంలో రాకపోకలు సాగిస్తుంది.
హైదరాబాద్–ఎర్నాకులం మార్గంలోనూ..
హైదరాబాద్–ఎర్నాకులం(07117/07118) ప్రత్యేక రైలు ఏప్రిల్ 11, 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27వ తేదీల్లో మధ్యాహ్నం 12.50కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30కి ఎర్నాకులం చేరుకుంటుంది. ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 2, 31, జూన్ 7, 1, 21, 28వ తేదీల్లో రాత్రి 9.45కి ఎర్నాకులం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.55కి నాంపల్లి చేరుకుంటుంది. ఈ రైలు నల్లగొండ, పిడుగురాళ్ల మార్గంలో నడుస్తుంది.
వేసవిలో పలు ప్రత్యేక రైళ్లు
Published Wed, Feb 7 2018 3:04 AM | Last Updated on Tue, Aug 28 2018 7:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment